Newsపవర్ స్టార్ మారాల్సిందేనా..!

పవర్ స్టార్ మారాల్సిందేనా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా ఉన్నా పవన్ త్రివిక్రం రెగ్యులర్ ఫార్మెట్ లోనే ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. అజ్ఞాతవాసి సినిమాపై కొన్నాళ్లుగా చర్చ నడుస్తుందని తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది సినిమా టైపులో ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది.

అయితే పవన్ రాజకీయ ప్రస్థానానికి ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడుతుంది అన్నది ప్రశ్నగా మారింది. సినిమా టైటిల్ విషయం అంతగా లేనట్టుగానే త్రివిక్రం మాటలతో సినిమా నడిపిస్తాడని తెలుస్తుంది. ఓ పక్క కోలీవుడ్ విజయ్ రాజకీయాల్లోకి రాకుండానే మెర్సల్ తో పొలిటికల్ ఫీవర్ తెప్పిస్తే.. ఆల్రెడీ జనసేన పార్టీ పెట్టి సోషల్ మెసేజ్ తో కాకుండా రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్స్ ఇస్తున్నందుకు కొంతమంది ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారు.

కేవలం ఎంటర్టైన్ కోసమే సినిమా అన్నట్టు కాకుండా సమజానికి బయట చెప్పేందుకు వీలులేనివన్ని సినిమాలో పొందుపరచవచ్చు కాని పవన్ మాత్రం అలా ఆలోచించడం లేదు. పవన్ మారాల్సిందే అంటూ కొందరు సినిప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనికి ఏవిధమైన రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news