RRR నుంచి తారక్ ఔట్.. కానీ!

NTR To Take Break From RRR

బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్, చరణ్‌ల పాత్రలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని.. ఆడియెన్స్ ఈ పాత్రలకు ఫిదా కావడం పక్కా అని సినిమా మొదట్నుండీ చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ లైన్‌లో ఉందని ప్రేక్షకులు ముందే అంచనాలు వేస్తున్నారు. కాగా తారక్, చరణ్‌లు చేసే పాత్రలు ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అని చిత్ర యూనిట్ తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నటిస్తున్న తారక్ తాజాగా సినిమా నుండి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే తారక్ ఫ్యాన్స్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేనిది ఈ విషయం. తారక్ సినిమా నుండి శాశ్వతంగా బయటకు రావడం లేదు.. కంటిన్యూగా షూటింగ్ చేస్తున్న తారక్ చిత్ర షూటింగ్ నుండి కొంత బ్రేక్ తీసుకోనున్నాడు. సైరా సినిమా నుండి ఫ్రీ అయిన చరణ్ ఇప్పుడు RRR సినిమా షూటింగ్‌లో నటిస్తాడు. కాగా ఎన్టీఆర్ ఇప్పుడు తన ఫ్యామిలీతో సమయం గడపనున్నాడు.

ఇక చరణ్ ఇప్పుడు కంటిన్యూగా సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. అటు జక్కన్న ఈ సినిమాను బాహుబలిని మించిన సినిమాగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. మరి తారక్ ఈ సినిమాలో ఎలాంటి నటవిశ్వరూపం చూపించనున్నాడో చూడాలి.

Leave a comment