Gossipsనాని 'జెర్సీ' రివ్యూ & రేటింగ్

నాని ‘జెర్సీ’ రివ్యూ & రేటింగ్

నాచురల్ స్టార్ నాని, గౌతం తిన్ననూరి డైరక్షన్ లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అర్జున్ (నాని) ఓ క్రికెటర్ దేశం కోసం ఆడాలన్న కలలు కనే మంచి క్రికెటర్. అయితే అతని ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఆర్ధికంగా బాగా వెనుకపడతాడు. ప్రేమించి పెళ్లాడిన సారా (శ్రద్ధా శ్రీనాథ్) కూడా అతన్ని అర్ధం చేసుకోదు. కొడుకు పుట్టినరోజు అడిగిన కోరికను తీర్చలేని అసమర్ధుడిగా మిగులుతాడు. ఇలాంటి టైంలో అతను తన కెరియర్ ఎక్కడ ఆపేశాడో అక్కడ మొదలుపెట్టాలని అనుకుంటాడు. కోచ్ సత్యరాజ్ అది సాధ్యం కాదని చెబుతాడు. కాని చేసి చూపిస్తాడు. 30 ప్లస్ లో కూడా అనుకున్నది సాధించవచ్చని ప్రూవ్ చేస్తాడు. రంజీలో ఆడుతున్న అర్జున్ ఆ జట్టు విజయానికి కారకుడవుతాడు. ఇదే జెర్సీ కథ.

నటీనటుల ప్రతిభ :

నాని నటనకు అందరు ఫిదా అవ్వాల్సిందే. నానికి నాచురల్ స్టార్ అనే స్క్రీన్ నేం ఎందుకు ఇచ్చారు అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అర్జున్ పాత్రలో నాని నటించడం కాదు జీవించేశాడు. ఇక శ్రద్ధ శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సత్యరాజ్ కూడా క్రికెట్ కోచ్ గా మరోసారి అలరించారు. ప్రవీన్, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ ఇలా మిగతా వాళ్లంతా అలరించారు. నాని కొడుకుగా చేసిన రోనిత్ కమ్ర కూడా బాగా చేశాడు.
1
సాంకేతికవర్గం పనితీరు :

సను వర్గేసే సినిమాటోగ్రఫీ బాగుంది. క్రికెట్ గేం సీన్స్ చాలా బాగా వచ్చాయి. సినిమాకు కెమెరా వర్క్ కూడా చాలా ప్లస్ అయ్యింది. ఇక అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది. కథ, కథనాల్లో దర్శకుడు గౌతం తన ప్రతిభ చూపాడు. సినిమా మొత్తం ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

మళ్లీ రావా సినిమాతో సుమంత్ కు హిట్టు ఇచ్చిన గౌతం తిన్ననూరి ఈసారి నానితో ఓ ఎమోషన డ్రామాగా జెర్సీ సినిమా చేశాడు. సినిమా కథ ఉన్నత లక్ష్యం గల ఓ సగటు మనిషి జీవితం. సినిమా మొదలైన కొద్దిసేపటికే మనం ఆ పాత్రలకు కనెక్ట్ అవుతాం. దర్శకుడు తను అనుకున్న విధంగా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ తో నడిపించాడు. సినిమాకు హైలెట్ గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అని చెప్పొచ్చు. నాని నటనకు బరువెక్కిన హృదయాలతో సినిమా థియేటర్ నుండి బయటకు వస్తారు. నాని జెర్సీ ఓ ఎమోషనల్ జెర్నీ.. తాము ఎంచుకున్న గోల్స్ కు రీచ్ అవడంలో వారు పడే బాధని బాగా చూపించాడు.

ప్లస్ పాయింట్స్ :

నాని నటన

మ్యూజిక్

ఎమోషనల్ సీన్స్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ : నాని జెర్సీ.. ఇది సినిమా కాదు ప్రతి ఒక్కరి జీవితం..!

రేటింగ్ : 3.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news