Moviesమీకు మాత్రమే చెప్తా రివ్యూ & రేటింగ్

మీకు మాత్రమే చెప్తా రివ్యూ & రేటింగ్

సినిమా: మీకు మాత్రమే చెప్తా
నటీనటులు: తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ తదితరులు
సంగీతం: శివకుమార్
సినిమాటోగ్రఫీ: మథన్ గుణదేవ్
నిర్మాత: విజయ్ దేవరకొండ
డైరెక్టర్: షమీర్ సుల్తాన్

పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సినిమా సక్సెస్‌లో కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను దర్శకుడు షమీర్ సుల్తాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మొదట్నుండీ ఇండస్ట్రీ వర్గా్ల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
పెళ్లికి సిద్ధమైన రాకేష్(తరుణ్ భాస్కర్)కు ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్నుండి ఓ వీడియో మెసేజ్ వస్తుంది. ఈ వీడియోతో అతడి పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డ రాకేష్ తన స్నేహితుడు అభినవ్‌తో కలిసి అది పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఆ వీడియో పంపిన వ్యక్తి రాకేష్‌ను రూ.20 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తాడు. ఈ క్రమంలో రాకేష్ తన స్నేహితులతో కలిసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తిని పట్టుకుంటారా లేదా..? ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? చివరకు రాకేష్ పెళ్లి జరుగుతుందా లేదా అనేది సినిమా కథ.

విశ్లేషణ:
డైరెక్టర్‌గా తన సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ఫలక్‌నుమా దాస్ సినిమాతో యాక్టింగ్ డెబ్యూ చేసి ఇప్పుడు మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారాడు. యాక్టింగ్ పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా చాలా సులువుగా తన పాత్రలకు న్యాయం చేసే తరుణ్, హీరోగా కూడా మెప్పించాడు. ఇక సినిమా ఫస్టాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లను కలుపుకుని అతడు పెళ్లి కోసం పడే పాట్లను చాలా ఫన్నీగా చూపించాడు దర్శుకుడు షమ్మీర్ సుల్తాన్. హీరోయిన్‌ను పెళ్లికి ఒప్పించే క్రమంలో అతడు చేసే ఫీట్లు కామెడీని పండించాయి. ఒక అదిరిపోయే ట్విస్టుతో ఇంటెర్వల్ బ్యాంగ్‌ వస్తుంది.

అటు సెకండాఫ్‌లో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు హీరో అతడి స్నేహితులతో కలిసి చేసే ప్రయత్నాలు కూడా కామెడీని పండించాయి. ముఖ్యంగా అభినవ్ గోమట చేసే కామెడీ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక సీరియస్‌ ఎపిసోడ్లను కూడా కామెడీతో నెట్టుకొచ్చిన డైరెక్టర్ అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్టుతో సినిమాను ముగించిన తీరు బాగుంది.

ఓవరాల్‌గా చూస్తే హీరోగా మారిన తరుణ్ భాస్కర్, కామెడీ జోనర్ మూవీతో హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక నిర్మాతగా మారిన విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా తన ఎంపిక బాగుందని నిరూపించాడు. మొత్తానికి కామెడీతో ఫన్ క్రియేట్ చేస్తూనే ఇంప్రెస్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
హీరోగా మారిన తరుణ్ భాస్కర్ యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రెస్ చేశాడు. ఫలక్‌నుమా దాస్‌లో యాక్టింగ్‌తో ఆకట్టుకున్న తరుణ్, ఇప్పుడు హీరోగా మారి ఇంప్రెస్ చేశాడు. అటు హీరో ఫ్రెండ్‌గా అభినవ్ గోమట కామెడీతో తనదైన ఫన్ క్రియేట్ చేశాడు. హీరోయిన్లుగా అవంతిక మిశ్రా, వాణి భోజన్‌లు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు షమీర్ సుల్తాన్ రాసుకున్న కథ చాలా బాగుంది. కామెడీ జోనర్‌లో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసి పండించిన ఫన్ చాలా బాగుంది. సంగీతం పరంగా సినిమాలో పాటలకు పెద్ద స్కోప్ లేకున్నా బీజీఎం వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు అక్కడక్కడ అస్సలు బాలేవు.

చివరగా:
మీకు మాత్రమే చెప్తా – కొందరికి మాత్రమే నచ్చే సినిమా

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news