Gossipsమహేష్ ను టార్గెట్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

మహేష్ ను టార్గెట్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్

ఈమధ్య కాలంలో ఓ సినిమా గురించి హంగామా జరిగింది అంటే అది కచ్చితంగా అర్జున్ రెడ్డి సినిమా అనే చెప్పాలి. చిన్న సినిమా అయినా సరే అది సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కేవలం ఓ ముద్దు పోస్టర్ తో వార్తల్లో నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది.

విజయ్ దేవరకొండ హీరోగా షాలిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సందీప్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అని లెక్క చెప్పి మరి హిట్ కొట్టిన దర్శకుడి గట్స్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. ఇక ఈమధ్యనే అతను తన తర్వాత సినిమాల గురించి మాట్లాడాడు.

కుదిరితే తన తర్వాత సినిమా మహేష్ తో చేస్తానని చెప్పడం విశేషం. మహేష్ బాబు డేట్స్ కోసం నమ్రతతో టచ్ లోనే ఉన్నాడట సందీప్ రెడ్డి. చూస్తుంటే మనోడు స్టార్ డైరక్టర్ అయ్యేలానే ఉన్నాడనిపిస్తుంది. అయితే మహేష్ తో సినిమా అంటే మాత్రం సందీప్ రెడ్డి మరో రెండేళ్లు వెయిట్ చేయక తప్పదు. మరి ఈలోగా వేరే హీరోని ట్రై చేయడం బెటర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news