Gossipsకోలీవుడ్ లో విజయ్ క్రేజ్ ను నిదర్శనం ఇది.. 63 సినిమా...

కోలీవుడ్ లో విజయ్ క్రేజ్ ను నిదర్శనం ఇది.. 63 సినిమా రికార్డులు మొదలయ్యాయి..!

కోలీవుడ్ లో స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని సినిమా పోస్టర్ దగ్గర నుండి సినిమా రిలీజ్ వరకు హంగామా వేరేలా ఉంటుంది. ఇక టీజర్, ట్రైలర్ తో పాటుగా రిలీజ్ తర్వాత కలక్షన్స్ హవా కూడా తెలిసిందే. కోలీవుడ్ లో అదిరిపోయే ఫాంలో ఉన్న విజయ్ ప్రస్తుతం తన 63వ సినిమా అట్లీ డైరక్షన్ లో చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే రికార్డులు సృష్టిస్తుంది.

విజయ్ ఇదవరకు సినిమాలు రిలీజ్ అయ్యాక రికార్డులు సృష్టించేవి కాని ఇప్పుడు సెట్స్ మీద ఉండగానే అతని సినిమాలు హంగామా చేస్తున్నాయి. విజయ్ 63వ సినిమా సన్ టివి ఏకంగా 60 కోట్లతో శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. కోలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ రేంజ్ శాటిలైట్ రైట్స్ జరుగలేదు. సినిమా మీద ఉన్న నమ్మకంతో సన్ టివి ఇన్ని కోట్లకు కోట్ చేసింది. ఇక డిజిటల్ రైట్స్ కూడా భారీగానే జరిగేట్టు కనబడుతున్నాయి.

కోలీవుడ్ లో విజయ్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. రజిని, కమల్ కాస్త వెనక్కి తగ్గేసరికి విజయ్ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. తెలుగులో పవన్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో కోలీవుడ్ లో విజయ్ కు క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. విజయ్ అట్లీ కాంబినేషన్ లో తెరి, మెర్సల్ రెండు సినిమాలు అదిరిపోయే హిట్ అయ్యాయి. మరి హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news