Moviesకవచం మూవీ " రివ్యూ & రేటింగ్ "

కవచం మూవీ ” రివ్యూ & రేటింగ్ “

చిత్రం: కవచం
దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ల
నిర్మాత: నవీన్ చౌదరి
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ తదితరులు

యాక్షన్ హీరోగా తన సత్తా చాటుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మరో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ కవచం. అందాల భామ కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తు్న్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. శ్రీనివాస్ మామిళ్ల డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ట్రైలర్‌, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
విజయ్(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథలో ఒక అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో అజయ్‌ను దోషిగా పట్టుకుంటాడు విజయ్. కట్ చేస్తే.. మెహ్రీన్‌‌ను కొంతమంది దుండగులు వెంబడిస్తుంటారు. ఆమెను కాపాడిన విజయ్, తన ఫ్లాష్‌బ్యాక్ ఆమెకు చెబుతాడు. కాజల్‌ను తాను ఎలా లవ్ చేశాడనే విషయాలు, కాజల్‌ సడెన్‌గా మాయం అయిన విషయాలు మెహ్రీన్‌కు చెబుతాడు. కట్ చేస్తే.. మెహ్రీన్‌కు క్లోజ్ అవుతాడు విజయ్. ఈ క్రమంలో విజయ్ తల్లికి యాక్సిడెంట్‌ జరగడంతో ఆపరేషన్‌కు డబ్బులు కావాల్సి ఉంటుంది. మెహ్రీన్ తనను కిడ్నాప్ చేశానని ఆమె బాబాయ్‌కు చెప్పి డబ్బులు తీసుకోమని విజయ్‌కు సలహా ఇస్తుంది. ఆమె చెప్పిన ప్రకారం విజయ్ చేస్తాడు.

కట్ చేస్తే.. మెహ్రీన్ నిజంగానే కిడ్నాప్‌కు గురవుతుంది. ఈ క్రమంలో మెహ్రీన్‌ శవం లభించడంతో విజయ్ ఇదంతా చేశాడని పోలీసులు అతడిని వెంబడిస్తుంటారు. చివరకు విజయ్ పోలీసులకు దొరుకుతాడా లేదా? అసలు మెహ్రీన్‌ను ఎవరు కిడ్నాప్ చేసి చంపేశారు? కాజల్ ఏమయ్యింది? మెహ్రీన్ కాజల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కవచం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
యాక్షన్‌కు కేరాఫ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా అదే కోవలోకి చెందిన సినిమాలు చేస్తున్నాడు. ఈసారి మరింత యాక్షన్ కోసం పోలీస్ అవతారంలో మనకు కనిపిస్తాడు. ఇక కవచం సినిమాలోకి వెళ్తే.. ఫస్ట్ హాఫ్‌లో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూనే తన లవ్ ట్రాక్‌ను మనకు చూపించారు. అయితే కాజల్ సడెన్‌గా ఎందుకు మాయం అయ్యిందనే విషయాన్ని కన్ఫ్యూజన్‌లో పెట్టాడు చిత్ర దర్శకుడు. అటు మెహ్రీన్‌తో హీరో దగ్గరవ్వడం ప్రేక్షకులకు అంతగా నచ్చదు. అయితే ఫస్ట్‌హాఫ్‌లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక కిడ్నాప్‌లతోనే ఫస్ట్ హాఫ్‌ను నెట్టుకొస్తారేమో అనుకుంటున్న సమయంలో అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.

సెకండాఫ్‌లో హీరో పోలీస్ నుండి క్రిమినల్‌గా మారడంతో అతడి కోసం పోలీసులు వెతుకుతుంటారు. వారి నుండి తప్పించుకుంటూనే అసలు దీనంతటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తాడు. ఇందులో భాగంగా కాజల్‌ మెహ్రీన్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయాన్ని రివీల్ చేసిన విధానం బాగుంది. ఈ క్రమంలో అతడు ఊహించని నిజాలు తెలుసుకుని షాక్‌కు గురవుతాడు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో పెద్దగా ఆకట్టుకునే అంశం లేకపోవడంతో అలా అలా ఫైట్ సీక్వెన్స్‌లతో కథను ముగించేశాడు డైరెక్టర్.

ఓవరాల్‌గా చూస్తే కవచం టైటిల్‌కు తగ్గట్లుగా సినిమాలో పాజిటివ్ అంశాలు పెద్దగా లేకపోవడంతో ఇది ఒక రొటీన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎదురుచూస్తున్న సూపర్ హిట్ కోసం మరింత వెయిట్ చేయాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా యాక్ట్ చేశాడు. తన లాస్ట్ మూవీ ‘సాక్ష్యం’లో కంటే కూడా కవచం చిత్రంలో మనోడి యాక్టింగ్ కాస్త బెటర్‌గా కనిపిస్తుంది. ఇక డైలాగ్ డెలివరీలో హీరోగారు తనకు తానే సాటి అనే రేంజ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందో ఆమెకె తెలియాలి. నటనకు పెద్ద స్కోప్‌లేన ఆమె పాత్ర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు. కాజల్ కంటే కూడా మెహ్రీన్ పాత్ర కాస్త బెటర్ అని చెప్పాలి. ఉన్నంతో ఆమె బాగా నటించేందుకు ట్రై చేసింది. విలన్‌లుగా ఈ సినిమాలో చాలా మంది కనిపిస్తారు. అజయ్, ముఖేష్ రిషి, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణె తదితరులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అయితే అతడు ఎంచుకున్న కథనం సినిమాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. కిడ్నాప్‌ల మిస్టరీలు చేధించే క్రమంలో పోలీస్ కాస్త నేరస్థుడిగా మారడం ప్రేక్షకులకు కనెక్ట్ కాని అంశం. అటు ఇన్ని కిడ్నాప్‌లు అవసరమా అనే రేంజ్‌లో ఈ సినిమాలో కిడ్నాప్‌లను వాడుకున్నాడు దర్శకుడు. అయితే ఇదే ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసింది. యాక్షన్ లవర్స్‌కి మాత్రం కవచం తప్పక నచ్చే సినిమా అవుతుంది. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. థమన్ మ్యూజక్ పర్వాలేదనిపించింది. ఒకటి రెండు పాటలు బాగుండి రీరికార్డింగ్‌తో సత్తా చాటాడు థమన్. చిత్ర నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.

చివరగా..
కవచం – యాక్షన్ లవర్స్‌కు ఓకే!

రేటింగ్: 2.25/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news