Movies యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్

యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్న ‘కాటమరాయుడు’.. అతి తక్కువ టైంలోనే చారిత్రాత్మక రికార్డ్

Pawan Kalyan’s latest movie katamarayudu teaser has created a historical record on youtube in just few hours by getting huge views and likes.

‘నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను’ అని గబ్బర్‌సింగ్ సినిమాలో చెప్పినట్లుగానే తన తాజా చిత్రం ‘కాటమరాయుడు’తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. తొలుత ఫస్ట్‌లుక్ పోస్టర్లతో సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపేసిన పవన్.. ఇప్పుడు టీజర్‌తో యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్నాడు. గతంలో ఇతర స్టార్ హీరోలు రోజుల్లో క్రియేట్ చేసిన రికార్డుల్ని గంటల వ్యవధిలోనే బద్దలుకొడుతున్నాడు.

మొదట.. గంటలో 5 లక్షలకి పైగా వ్యూస్, 50 వేలకు పైగా లైక్స్ సాధించిన ఈ టీజర్.. కేవలం 3 గంటల్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. ఆ సమయంలో ఈ టీజర్‌కి 1.2 మిలియన్‌కి పైగా వ్యూస్ రాగా.. అదే టైంలో ఏకంగా ఒక 80 వేలకు లైక్స్ వచ్చాయి. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంత తక్కువ టైంలో ఏ ఒక్క తెలుగు టీజర్ ఈ రేంజులో ప్రభంజనం సృష్టించిన దాఖాలాలైతే ఇప్పటివరకు లేదు. ఈ దెబ్బతో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దీన్ని బట్టి.. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ టీజర్ దూకుడు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఎవరూ ఊహించని స్థాయిలో వ్యూస్‌తోపాటు లైక్స్ సొంతం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ‘సర్గార్ గబ్బర్ సింగ్’తో డిజాస్టర్‌ చవిచూసినప్పటికీ.. పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. టీజర్‌కే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందంటే.. ట్రైలర్‌కి ఏ రేంజులో ఉంటుందా? అని అప్పుడే అంచనాలు వేయడం మొదలుపెట్టేశారు. చూడబోతో.. ఈ చిత్రంతో పవన్ బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకోవడం ఖాయమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news