Gossipsనా చెస్ట్‌ను అలా చేశారు.... లైంగీక వేధింపుల‌పై స్టార్ హీరోయిన్ క‌న్నీళ్లు..

నా చెస్ట్‌ను అలా చేశారు…. లైంగీక వేధింపుల‌పై స్టార్ హీరోయిన్ క‌న్నీళ్లు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ‌త యేడాది కాలంగా ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ అంశాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ముక్కు సూటిగా మాట్లాడ‌డంతో పాటు హృతిక్‌రోష‌న్ లాంటి హీరోపై అయినా ఓపెన్‌గానే విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఆమె దిట్ట‌. ఇంకా చెప్పాలంటే కంగ‌నాను చాలా మంది మ‌గ‌రాయుడిగా పోలుస్తారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టే క్ర‌మంలోనే ఆమె చాలా మందికి శ‌త్రువుగా మారిపోయింది.

తాజాగా ఆమె అమీర్‌ఖాన్ నిర్వ‌హించిన ఓ టాక్ షోలో తాను ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెప్పింది. ఈ కార్య‌క్ర‌మంలో కంగ‌నా మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు అయిన దీపిక పదుకునే మరియు పరణీతి చోప్రాలతో కలిసి పాల్గొంది. ఈ షోలో వీరు అమ్మాయిలు ఎదుర్కొంటోన్న లైంగీక వేధింపుల గురించి చ‌ర్చించారు. కంగ‌నా గ‌తంలోనే మీ టూ ఉద్య‌మం బాగా వైర‌ల్ అయిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెప్పింది.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు త‌న‌ను వాడుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేశార‌ని.. ఛాన్సుల కోసం చాలా ఇబ్బంది పెట్టార‌ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. ఇక తాజా టాక్ షోలో ఆమె స్కూల్ ఏజ్‌లో ఎదుర్కొన్న లైంగీక వేధింపులు చెప్పింది. కంగ‌న ఛండీఘ‌ర్‌లో చ‌దువుకునే క్ర‌మంలో కొంద‌రు ఆక‌తాయిలు బైక్‌పై వ‌చ్చి అల్ల‌రి చేస్తుంటే వార‌ని… కొంద‌రు స్కూల్‌కు న‌డిచి వెళుతుంటే వెన‌కాలే వ‌చ్చి చెస్ట్‌పై బ‌లంగా గుద్ది వెళ్లేవార‌ని క‌న్నీరు పెట్టుకుంది. ఆ టైంలో త‌న‌ను ఎవ‌రైనా చూశారా ? అని తెగ భ‌య‌పడేదానిని అన్న విష‌యం కూడా కంగ‌న చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news