Gossips" కళ్యాణ్ రాం 118 " రివ్యూ & రేటింగ్

” కళ్యాణ్ రాం 118 ” రివ్యూ & రేటింగ్

నందమూరి కళ్యాణ్ రాం, కెమెరా మెన్ గుహన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 118. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ గా వచ్చిన ఈ సినిమాలో షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. మహేష్ కోనెరు నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
6
కథ :

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న గౌతం (కళ్యాణ్ రాం) హోం మినిస్టర్ బ్రదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఆధారాలు సేకరిస్తాడు. అయితే ఇదిలాఉంటే గౌతం కు కలలో ఎవరో అమ్మాయి ఆపదలో ఉన్నట్టు తన సహాయం కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కల అందులో ఏమాత్రం నిజం లేదని స్నేహితులు చెబుతున్నా ఆమె కోసం వెతుకుతాడు. అయితే సేం అలానే మరో అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు రాగా ఆమె ద్వారా కలలో వచ్చే అమ్మాయి ఆద్య (నివేదా)ని కనిపెడతాడు. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ లో గౌతం లవర్ మేఘా (షాలిని పాండే) అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది. ఇంతకీ ఎవరు ఈ ఆద్య ఎందుకు గౌతం కలలోకి వచ్చింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
5
నటీనటుల ప్రతిభ :

కళ్యాణ్ రాం సినిమాలో గౌతం పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్నట్టు చేశాడు. ఇక సినిమాలో నివేదా థామస్ నటన అద్భుతంగా ఉంది. తనకు ఇచ్చిన పాత్రకి పర్ఫెక్ట్ న్యాయం చేసింది. షాలిని పాండే కూడా ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ శ్రీను కూడా ఆకట్టుకున్నాడు. నాజర్, రాజీవ్ కనకాల, జబర్దస్త్ మహేష్ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. ఇలాంటి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండాలి. ఆ విషయంలో శేఖర్ అదరగొట్టాడు. ఇక సినిమాటోగ్రఫీ కెవి గుహన్ తనకు ఎలా కావాలో అలా తీసుకున్నాడు. దర్శకుడు, కెమెరా మెన్ ఒకడే అయితే ఆ ఫ్రేమింగ్ వేరేలా ఉంటుంది. ఇక కథ, కథనాల్లో గుహన్ తన ప్రతిభ చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
3
విశ్లేషణ :

తనని వెంటాడుతున్న ఓ కల అందులోని అమ్మాయిని కనిపెట్టే క్రమంలో హీరో గౌతం ఏం చేశాడు అన్నది సినిమా కథ. సినిమా టైటిల్ ఎందుకు 118 అని పెట్టారో మొదలైన మరు నిమిషమే క్లారిటీ ఇస్తారు. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తాయి. అయితే అక్కడక్క కాస్త కన్ ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది.
1
గుహన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంకాస్త కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమా రెగ్యులర్ సిని లవర్స్ కు నచ్చే జానర్ కాదు. స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా అనిపిస్తున్నా ఆడియెన్స్ ను ఇన్వాల్వ్ చేసే విషయంలో ట్రాక్ తప్పింది. నందమూరి ఫ్యాన్స్ కు బాగా నచ్చే సినిమా అవుతుంది.
2
కళ్యాణ్ రాం వరకు బాగా చేశాడు. ఈ కథను ఒప్పుకోవడం పెద్ద సాహసమే. డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చిన 118 తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ రాం

నివేదా థామస్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ ఫ్లాష్ బ్యాక్

స్క్రీన్ ప్లే

కన్ ఫ్యూజ్

బాటం లైన్ : కళ్యాణ్ రాం 118.. మెప్పించేశారు..!

రేటింగ్ : 3.0/5

https://youtu.be/KypNI5ug4vk

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news