Gossipsతమన్నా ప్లేస్ లో కాజల్.. గదిలో ఏం జరుగుతుంది..!

తమన్నా ప్లేస్ లో కాజల్.. గదిలో ఏం జరుగుతుంది..!

ఓంకార్ డైరక్షన్ లో వచ్చిన రాజు గారి గది సినిమా హిట్ అవగా ఆ తర్వాత ఆ సినిమా సీక్వల్ గా రాజు గారి గది 2 అంచనాలను అందుకోలేదు. నాగార్జున, సమంత వంటి స్టార్స్ నటించినా సరే రాజు గారి గది 2 వర్క్ అవుట్ కాలేదు. అదీకాకుండా మళయాళ సినిమా రీమేక్ గా తెరకెక్కింది కాబట్టి రాజు గారి గది 2 సినిమా ఆశించిన స్థాయిలో లేదు. అందుకే సొంత కథతో రాజు గారి గది 3 అని మొదలు పెట్టాడు ఓంకార్.

తమన్నా హీరోయిన్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమాకు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా పెద్ద షాక్ తగిలింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమా చేయలేనని హ్యాండ్ ఇచ్చింది. ఆమె ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లిన కారణాలు ఏంటో తెలియలేదు. ఓంకార్ ఇప్పుడు తమన్నా ప్లేస్ లో తాప్సీ, కాజల్ ను సెట్ చేసే పనిలో ఉన్నారట. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో ఈమధ్య క్రేజ్ తెచ్చుకుంది తాప్సీ.

ఈమధ్యనే గేం ఓవర్ అంటూ సూపర్ హిట్ కొట్టింది. అయితే తాప్సీ రాజు గాది గది 3లో నటించకపోవచ్చని టాక్. ఓంకార్ అండ్ టీం కూడా కాజల్ కు ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. కాజల్ కూడా ఈ సీక్వల్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందట. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి తమన్నా ముహుర్తం పెట్టిన గదిలోకి కాజల్ అడుగుపెడుతుందన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news