Movies" జై సింహా " రివ్యూ

” జై సింహా ” రివ్యూ

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై సింహా. సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మాస్ మసాలా మూవీగా వస్తుంది. నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన జై సింహా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా అంచనాలను అందుకునేలా ఉందో లేదో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ : నరసింహం (బాలకృష్ణ) ఓ చంటి బిడ్డతో జీవనం సాగిస్తుంటాడు. అనుకోకుండా అతన్ని కొందరు ఎటాక్ చేస్తారు. వారిని నుండి తప్పించుకుని ఎలాగోలా సేవ్ అవుతాడు నరసింహం. ఈ క్రమంలో అతనికి అండగా ఉంటారు మురళి మోహన్ అండ్ ఫ్యామిలీ. బయటకు మాములుగా ఉన్నా సరే తన లోపల చాలా బాధ, పగ ఉంటుంది. అదేంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నించినా కుదరదు. అసలు ఇంతకీ ఆ చంటి బిడ్డ ఎవరు..? తన ప్రేమను త్యాగం చేసిన నరసింహం ఎందుకు ఇలా మారిపోయాడు..? వైజాగ్ లో అతని జీవితం ఎలా టర్న్ తీసుకుంది..? అన్నది అసలు కథ.
నటీనటుల ప్రతిభ :
నందమూరి బాలకృష్ణ.. నట సింహం మరోసారి పవర్ ఫుల్ గా గర్జించింది. సినిమా అంచనాలకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ తో పాటుగ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ను అలరించాడు బాలయ్య బాబు. నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్యను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా కనిపించారు. ఇక నయనతార ఉన్నది కొంతసేపే అయినా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించింది. సినిమాలో ఆమె ట్విస్ట్ బాగుంటుంది. ఇక హరిప్రియ కూడా మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఫేడవుట్ అయిన భామకు సినిమాలో మంచి అవకాశం దొరికిందని చెప్పొచ్చు. నటాషా దోషి పర్వాలేదు. ఇక మురళి మోహన్ చాలా రోజుల తర్వాత తన తరహా పాత్రలో కనిపించి అలరించాడు. విలన్ గా చేసిన అతను కూడా బాగా చేశాడు. బ్రహ్మానందం కామెడీ పర్వాలేదు.
సాంకేతికవర్గం పనితీరు :
చిరంతన్ భట్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది.. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. రత్నం కథా మాటలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. రవికుమార్ డైరక్షన్ కూడా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశారు రాం లక్ష్మన్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు.
విశ్లేషణ :
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన జై సింహా రివెంజ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ ఇదవరకు సినిమాల్లో చూసినట్టు అనిపించినా కథనంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. ముఖ్యంగా బాలయ్య మార్క్ మాస్ మసాలా అటెంప్ట్ పర్ఫెక్ట్ గా డీల్ చేసినట్టు అనిపిస్తుంది. మొదటి భాగం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ గ్రిప్పింగ్ తో సినిమా నడుస్తుంది.
సినిమా మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. శాతకర్ణి, పైసా వసూల్ తో డిఫరెంట్ సినిమాలను తీసిన బాలయ్య ఈసారి తన మార్క్ మాస్ సినిమాగా వచ్చాడు. ఇక కథ కథనాలు కూడా జై సింహాకు సపోర్ట్ ఇవ్వడంతో సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కథనంలో అక్కడక్కడ స్లో అవడం తప్పిస్తే సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది.
సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీతో వెళ్లి చక్కగా చూసొచ్చే సినిమా జై సింహా. వాయిలెన్స్ ఉన్నా సరే అది మరి శృతిమించలేదు. బి, సి సెంటర్స్ లో ఈ సినిమాకు బ్రహ్మరధం పడతారని చెప్పొచ్చు. బాలయ్య మళ్లీ తన రెగ్యులర్ సినిమాల పంథాను కొనసాగించేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుంది.
ప్లస్ పాయింట్స్ :
బాలయ్య
సినిమాటోగ్రఫీ
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
మ్యూజిక్
అక్కడక్కడ ల్యాగ్న్ అవడం
బాటం లైన్ :
జై సింహా.. గర్జించిన బాలయ్య..!
రివ్యూ & రేటింగ్ : 3/5http://www.telugulives.com/telugu/1st-day-top-movies/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news