Gossips" గీత గోవిందం " ఫస్ట్ డే కలెక్షన్స్.. గోవిందా.. గోవింద..

” గీత గోవిందం ” ఫస్ట్ డే కలెక్షన్స్.. గోవిందా.. గోవింద..

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా యూనానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఎలాంటి కొత్తదనం లేకున్నా సరే సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగించిన దర్శకుడి పనితీరు అద్భుతమని చెప్పొచ్చు.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ సినిమాగా వచ్చిన గీతా గోవిందం సినిమా ఓవర్సీస్ లో కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. సినిమా ప్రీమియర్స్ లోనే 400k డాలర్స్ వసూళు చేసిందని తెలుస్తుంది. ఇక యూఎస్ లో నిన్న మధ్యాహ్నం ఒక్క షోకి 63, 513 డాలర్స్ వసూళు చేసిందట. 130 సెంటర్స్ లో రిలీజ్ అయిన గీతా గోవిందం ఓవర్సీస్ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చేసిందని ఈ కలక్షన్స్ చూస్తే చెప్పొచ్చు.

తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అయితే భారీ వర్షాల కారణంగా ఇక్కడ కలక్షన్స్ కాస్త తక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల కలక్షన్స్ రిపోర్ట్ ఇంకా రాలేదు.

https://youtu.be/SoL1EDjIOH0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news