Gossips' గ్యాంగ్‌లీడ‌ర్ ' ట్రైల‌ర్‌ టాక్... షాక్ లో ఫ్యాన్స్..

‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ ట్రైల‌ర్‌ టాక్… షాక్ లో ఫ్యాన్స్..

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్‌లీడ‌ర్‌. మెగాస్టార్ కెరీర్‌లో ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన గ్యాంగ్‌లీడ‌ర్ టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమాకు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. 2.30 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్‌లో క‌థేంటో చెప్పేశారు.

ఇంగ్లీషు సినిమాల డీవీడీలు చూసి క‌థ‌లు రాసే నానిని ఐదుగురు అమ్మాయిల గ్యాంగ్ అప్రోచ్ అవుతారు. వాళ్ల‌కు ఓ విల‌న్ (కార్తీకేయ‌) ఉంటాడు. వాడు మామూలోడు కాదు… వాడిని ఢీకొట్టేందుకు కామెడీగా మొద‌లైన క‌థ కాస్తా రివెంజ్ కేసు చాలా సీరియస్ గా మారుతుంది. మరి ఈ లేడీ గ్యాంగ్ లీడర్ తనను నమ్ముకుని వచ్చినవాళ్ళకు ఎలాంటి న్యాయం చేశాడు అన్న‌దే అసలు కథ.

పైకి రివేంజ్ డ్రామాగా ఉన్నా కావాల్సినంత ఫ‌న్ ఉంద‌న్న‌ది తెలుస్తోంది. అయితే విక్ర‌మ్ కుమార్ కామెడీ స్టోరీలు డీల్ చేయ‌డ‌లేడ‌న్న టాక్ ఉంది. సినిమాలో ల‌వ్ ట్రాక్ చాలా సింపుల్‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఇక నాని సినిమాలు మ‌రో రెండు, మూడు వారాల్లో రిలీజ్ అవుతాయంటే సోష‌ల్ మీడియాలో, బ‌య‌ట మామూలు హంగామా ఉండ‌దు.

గ్యాంగ్‌లీడ‌ర్‌కు ఎలాంటి హంగామా లేదు. డైరెక్ట‌ర్‌పై డౌట్ ఉంది. డైరెక్ట‌ర్ టేకింగ్‌కు, నాని ఇమేజ్‌కు ఎంత వ‌ర‌కు సెట్ అవుతుంద‌న్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల నాని మార్కెట్ పెర‌గ‌డం లేదు. ఈ ఎంటర్ టైనర్ మీద నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ట్రైల‌ర్ ఆ రేంజులో ఉందా ? అంటే అనుమానాలు ఉన్నాయి. మ‌రి నాని గ్యాంగ్‌లీడ‌ర్ ఏం చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news