Moviesవెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్-2' రివ్యూ & రేటింగ్

వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్-2’ రివ్యూ & రేటింగ్

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి బరిలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఎమ్మెల్యే దగ్గర పిఏ గా పనిచేస్తున్న వెంకీ (వెంకటేష్) హారిక (తమన్నా)ని పెళ్లిచేసుకుంటాడు. సాఫీగా సాగుతుంది అనుకున్న టైంలో హారిక వెంకీని టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. భార్యా బాధితుడిగా ఫన్, ఫ్రస్ట్రేట్ అవుతున్న వెంకీకి తన కో బ్రదర్ గా హారిక సిస్టర్ హనీ (మెహ్రీన్)ని ప్రేమిస్తున్నానంటూ వెంకీని కలుస్తాడు వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్). వెంకీ అనుభవాలను వరుణ్ తో చెప్పుకున్నా అతను మాత్రం వినిపించుకోడు. ఆమెతో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తాడు. చిన్నగా వరుణ్ ను హనీ టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. ఈ ఇద్దరు వారిని వదిలి యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే అది తెలుసుకున్న హారిక, హనీలు యూరప్ వెళ్తారు. అక్కడ ప్రకాశ్ రాజ్ ఇంట్లో వీరంతా ఏం చేశారు. ఫైనల్ గా వెంకీ, వరుణ్ తమ ఫ్రస్ట్రేషన్ ను ఎలా తగ్గించుకున్నారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగే అని చెప్పొచ్చు. ఆయన నుండి కోరుకునే కామెడీ, పంచ్ డైలాగ్స్, నటన ఈ సినిమాలో చూడొచ్చు. మళ్లీ అందరికి నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి టైం లో వెంకటేష్ ను గుర్తు చేస్తారు. వరుణ్ కూడా బాగానే చేశాడు. తెలంగాణా స్లాంగ్ లో వరుణ్ డైలాగ్స్ మెప్పించాయి. హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ ఇద్దరు బాగానే చేశారు. సెకండ్ హాఫ్ లో గ్లామర్ షో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. రఘుబాబు, ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి వంటి వారి పాత్రలన్ని అలరించాయి. అన్నపూర్ణ, వై విజయ పాత్రలు ఆకట్టుకున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతగా మెప్పించలేదు. బిజిఎం ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు అనీల్ రావిపుడి కొత్తగా ఏం చేయలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ మీద నడిపించాడు పెద్దగా చెప్పేందుకు కథ ఏమి లేదు. తన మార్క్ చూపించే డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

కొన్ని సినిమాలు టైటిల్, ట్రైలర్ చూడగానే సినిమా ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. అలాంటి వాటిలో ఎఫ్-2 ఒకటి. వెంకీ, వరుణ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీగా ఎఫ్-2 వచ్చింది. అయితే ఈ సినిమా కథ పెద్దగా బాగాలేకున్నా కథనం కామెడీతో మెప్పించాడు దర్శకుడు అనీల్ రావిపుడి. ఫస్ట్ హాఫ్ దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్స్ బాగా పండాయి.

డైలాగ్స్ కూడా అద్భుతంగా రాసుకున్నాడు అనీల్. అయితే సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫన్ తో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ఫ్రస్ట్రేషన్ తో నడిపించాడు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా చూసే సినిమాగా ఎఫ్-2 ఉందని చెప్పొచ్చు. మొదటి భాగంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త గ్రాఫ్ తగ్గినా ఫైనల్ గా ఆడియెన్స్ కు ఎంటర్టైనింగ్ ఇవ్వడంలో సకెస్ అయ్యాడు అనీల్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సంక్రాంతి పక్కా హిట్ మూవీ ఎఫ్-2 అని చెప్పొచ్చు. డైరక్టర్ అనీల్ రావిపుడి ఎఫ్-3కి హింట్ ఇవ్వడం కొసమెరుపు అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేష్ కామెడీ

సినిమాటోగ్రఫీ

ఫస్ట్ హాఫ్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ ల్యాగ్ అవడం

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్

మ్యూజిక్

బాటం లైన్ :

ఎఫ్-2.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మిక్సెడ్..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news