Moviesఎఫ్-2 7డేస్ కలక్షన్స్.. వెంకటేష్ మేనియాకు బాక్సాఫీస్ షేక్..!

ఎఫ్-2 7డేస్ కలక్షన్స్.. వెంకటేష్ మేనియాకు బాక్సాఫీస్ షేక్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి బరిలో జనవరి 12న ఓ మోస్తారు అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకటేష్ కామెడీ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అనీల్ రావిపుడి డైరక్షన్ టాలెంట్ తో తెలుగు రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఎఫ్-2ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా వసూళ్లు అదరగొడుతున్నాయి. 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఎఫ్-2 42.9 కోట్లతో లాభాల బాట నడుస్తుంది. వారం లోనే వసూళ్లు దుమ్మురేపుతుండగా మరో వారం దాకా ఇదే హవా కొనసాగించేలా ఉన్నారు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎఫ్-2 ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ సినిమా 7 డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 11.82 కోట్లు

సీడెడ్ : 4.71 కోట్లు

వైజాగ్ : 4.75 కోట్లు

ఈస్ట్ : 4.26 కోట్లు

వెస్ట్ : 2.37 కోట్లు

కృష్ణా : 3.12 కోట్లు

గుంటూరు : 3.14 కోట్లు

నెల్లూరు : 1.18 కోట్లు

ఏపి/తెలంగాణ : 35.35 కోట్లు

కర్ణాటక : 2.2 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.70 కోట్లు

యూఎస్ : 4.65 కోట్లు

వరల్డ్ వైడ్ : 42.9 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news