Moviesచరిత్ర సృష్టించిన ‘చిన్నవాడు’.. రికార్డ్ ధరకి శాటిలైట్ రైట్స్

చరిత్ర సృష్టించిన ‘చిన్నవాడు’.. రికార్డ్ ధరకి శాటిలైట్ రైట్స్

Young hero Nikhil Siddhartha’s latest movie Ekkadiki Pothavu Chinnavada satellite rights has been sold for bomb price which is said to be record in medium range heroes.

యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నిఖిల్ మూవీ అంటే.. ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందన్న భావన అందరిలోనూ ఫిక్స్ అయిపోయింది. అందుకే.. అతని మూవీలు చూసేందుకు జనాలు థియేటర్లకు తరలి వస్తున్నారు. అంతేకాదు.. టీవీల్లోనూ నిఖిల్ మూవీలకు మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నాయి. దాంతో.. ఈ కుర్రాడి సినిమాల శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోవడం కోసం టీవీ ఛానెళ్లు కూడా పోటీ పడుతున్నాయి. తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీ రైట్స్ కూడా రికార్డ్ రేటుకి అమ్ముడుపోయినట్లు సమాచారం.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఏకంగా రూ.4 కోట్లకు ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఇది నిఖిల్ కెరీర్‌లోనే కానీ.. అతని రేంజ్‌ హీరోల్లో రికార్డ్. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 50 రోజుల రన్‌టైంలో రూ.40 కోట్లు గ్రాస్, రూ.22 కోట్లపైన షేర్ వసూలు చేయడంతోపాటు రూ.4 కోట్లకు శాటిలైట్ రైట్స్ సోల్డ్ అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. నిజానికి.. రిలీజ్‌కి ముందు శాటిలైట్ రైట్స్ విషయమై మేకర్స్, ఛానెల్‌కి మధ్య బేరసారాలు జరిగాయి. అప్పట్లో రూ.3 కోట్లు ఇస్తామని ఛానెల్‌వారు చెప్పగా.. అందుకు మేకర్స్ ఒప్పుకోలేదు. రిలీజయ్యాక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. రూ.4 కోట్లకు డీల్ కుదిరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news