Movies‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కెరీర్‌లో రికార్డ్!!

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కెరీర్‌లో రికార్డ్!!

“Ekkadiki Pothavu Chinnavada” movie has collected huge collections in it’s first day run around the world which is a record figure in Nikhil Siddhartha’s career. In this film Nanditha Swetha, Hebbah Patel starred as heroines opposite to Nikhil. This movie directed by “Tiger” fame VI Anand.

కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో.. దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బంది నెలకొంది. ఇలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న సినిమాలన్నీ కలెక్షన్లు లేక విలవిలలాడుతున్నాయి. కనీసం సంతృప్తికరమైన వసూళ్లైనా వస్తున్నాయా? అంటే అవీ లేవు. దాదాపు థియేటర్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో యంగ్ హీరో నిఖిల్ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ని రిలీజ్ చేశాడు. దీంతో.. బ్యాంకుల బాట పట్టిన జనాలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్లకు వస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది. ఈ సందేహానికి తెరదించుతూ మంచి వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. సినీ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. నిఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ.1.82 కోట్లు కలెక్ట్ చేసింది. నిఖిల్ స్థాయికి ఇది పెద్ద ఫిగరే. అందులోనూ.. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఇంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా విశేషమే. రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు నెలకొనడం, రిలీజయ్యాక పాజిటివ్ టాక్ రావడం వల్లే.. ఈ చిత్రం అంతమొత్తం కలెక్ట్ చేయగలిగిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్ల ద్వారా 25 వేల డాలర్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. శుక్రవారం ఏకంగా 95 వేల డాలర్లు కొల్లగొట్టింది. అంటే.. ఫస్డ్ డేనే లక్షా 20 వేల డాలర్లు (గ్రాస్) ఈ మూవీ ఖాతాలో చేరిపోయాయన్నమాట. ఈ మూవీ కంటెంట్ చాలా బాగుండడంతో.. అక్కడి ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. పైగా.. అక్కడ నోట్ల సమస్య, ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.

ఏరియాల వారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 0.43
సీడెడ్ : 0.17
నెల్లూరు : 0.14
కృష్ణా : 0.10
గుంటూరు : 0.14
వైజాగ్ : 0.16
ఈస్ట్ గోదావరి : 0.11
వెస్ట్ గోదావరి : 0.07
ఏపీ+తెలంగాణ షేర్ : రూ. 1.22 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా : 0.10
ఓవర్సీస్ : 0.50
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ. 1.82 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news