Moviesతమిళ సినిమాతో పండగ చేసుకుంటున్న తెలుగు బ్యూటీ

తమిళ సినిమాతో పండగ చేసుకుంటున్న తెలుగు బ్యూటీ

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో మంచి ఫేం రావడం చాలా కష్టం. అయితే అవన్నీ దాటుకుని తెలుగులో మంచి పేరు సాధించుకున్న తెలుగు బ్యూటీలు చాలా తక్కువ మందే. వారిలో ఈషా రెబ్బా కూడా ఒకరు. తెలుగమ్మాయే అయినా చూడటానికి నార్త్ భామలా ఉండే ఈ బ్యూటీ తన హాట్ అందాలతోనే కాకుండా హావభావాలతోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ అందరిలాగే అమ్మడికి తెలుగులో అంతగా పేరు రాలేదు. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ తన చూపు తమిళ ఇండస్ట్రీపై పెట్టింది.

తమిళంలో జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో ఇషా లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే చిత్ర షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌తో ఇషా పాప ఫుల్ హ్యాపీగా ఉందట. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అమ్మడి పాత్ర చాలా బాగుంటుందని టాక్. తమిళంలో తన కెరీర్‌ సక్సెస్ కావాలని చూస్తున్న ఇషాకు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.

మరి తెలుగులో పెద్దగా సినిమాలు లేని ఈ బ్యూటీ తమిళంలో ఎలా రాణిస్తుందో చూడాలి. ఏదేమైనా తమిళంలో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న తెలుగు బ్యూటీ దాన్ని దక్కించుకోవాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news