Moviesభారీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన డిస్కో రాజా!

భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన డిస్కో రాజా!

మాస్ రాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ డిస్కో రాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ యాక్షన్ సీన్‌ను ఐస్‌లాండ్ దేశంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు రవితేజ.

కాగా ఐస్‌లాండ్ దేశంలో ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు చిత్ర యూనిట్. దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. అయితే రవితేజ పాత్రలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఐస్‌లాండ్‌లోని రెండో అతిపెద్ద మంచుకొండపై ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు. రోజుకు 4 గంటల ప్రయాణం చేస్తూ కొండపైకి చేరుకునే వారు.

ఎట్టకేలకు ఐస్‌ల్యాండ్‌లో చిత్ర షూటింగ్‌ను చిత్ర యూనిట్ పూర్తి చేశారు. ఈ సినిమా కథ ప్రకారం అంత రిస్కీ షాట్లు అవసరం కాబట్టే చిత్ర యూనిట్ రిస్కీ షూటింగ్ చేసినట్లు తెలిపారు. ఏదేమైనా అడ్వెంచరస్‌గా సాగిన ఈ షూటింగ్ ముగియడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news