Movies‘ధృవ’ 6 రోజుల కలెక్షన్స్.. ఆగని రామ్ చరణ్ దూకుడు!

‘ధృవ’ 6 రోజుల కలెక్షన్స్.. ఆగని రామ్ చరణ్ దూకుడు!

Ram Charan’s latest film Dhruva sixth day collections are out and figures are very good on week day run also. This is Tamil blockbuster Thani Oruvan remake and directed by stylish director Surender Reddy.

ఓ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. దాని ప్రభావం ఏ రేంజులో ఉంటుందో ‘ధృవ’ చిత్రం నిరూపిస్తోంది. ఫస్ట్ వీకెండ్‌లోనే కాకుండా వీక్ డేస్‌లోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళుతోంది. సోమ, మంగళవారాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఆరోరోజైన బుధవారంనాడు కూడా సంతృప్తికరమైన కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. బుధవారం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.1.36 కోట్లు కొల్లగొట్టింది. మిగిలిన ఐదురోజుల కలెక్షన్స్‌తో ఆరోరోజు వసూళ్లు కలుపుకుంటే.. ‘ధృవ’ ఖాతాలో రూ.29.49 కోట్లు జమ అయినట్లు లెక్క తేలింది. రేపటితో ఈ చిత్రం 30 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం ఖాయమని స్పష్టమవుతోంది.

పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఇండస్ట్రీ మొత్తం స్లంప్‌లో ఉన్నప్పటికీ.. దాని ఎఫెక్ట్‌ని ఎదుర్కొని ‘ధృవ’ ఈ రేంజులో దూసుకెళుతుండడం నిజంగా విశేషమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడం వల్లే ఇలా వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోందని అంటున్నారు. టోటల్ రన్‌లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.40 కోట్ల మార్క్‌ని క్రాస్ చేస్తుందని, వరల్డ్‌వైడ్‌గా రూ.60 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏరియాల వారీగా ఆరు రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 10.24
సీడెడ్ : 4.92
వైజాగ్ : 3.75
గుంటూరు : 3.25
ఈస్ట్ గోదావరి : 2.28
కృష్ణా : 2.11
వెస్ట్ గోదావరి : 2.00
నెల్లూరు : 0.94
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 29.49 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news