Movies‘ధృవ’ 5 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఆ క్లబ్‌లోకి చేరిపోయిన చరణ్

‘ధృవ’ 5 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఆ క్లబ్‌లోకి చేరిపోయిన చరణ్

Ram Charan’s latest movie Dhruva is doing very well at domestic boxoffice. According to the latest trade report, this movie has enterted in 40 crores club in just five days of it’s run. This movie directed by Surender Reddy and Aravind Swamy played villain role.

ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమా అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్‌లో (రూ.21.81 కోట్లు) కలెక్షన్ల సునామీ సృస్టించిన ఈ సినిమా.. వీక్ డేస్‌లోనూ డీసెంట్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఇప్పటికే సోమవారంనాడు రూ.3.89 కోట్లు కలెక్ట్ చేసిన ‘ధృవ’.. ఐదోరోజైన మంగళవారం కూడా చెప్పుకోదగిన వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ఐదో రోజు రూ.2.43 కోట్లు కొల్లగొట్టింది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదురోజుల్లో ఈ చిత్రం రూ.28.13 కోట్లు సాధించింది.

ఇక కర్ణాటకలో రూ.5.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియా నుంచి రూ.1.25 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ లెక్కలన్నీ కలుపుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ‘ధృవ’ ఐదురోజుల కలెక్షన్స్ రూ.40.1 కోట్లు అని తేలింది. తొలిరోజు ఈ చిత్రానికి అన్నివైపుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్లే ఇలా ప్రభంజనం సృష్టిస్తోందని, ఐదురోజుల్లోనే 40 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందని అంటున్నారు. ఈ మూవీ దూకుడు చూస్తుంటే.. త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని, టోటల్ రన్‌టైంలో రూ.60 కోట్లపైనే కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంతో రామ్ చరణ్ యూఎస్‌లో ఎట్టకేలకు 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయాడు.

ఏరియాల వారీగా 5 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 9.64
సీడెడ్ : 4.72
నెల్లూరు : 0.89
కృష్ణా : 2.02
గుంటూరు : 3.14
వైజాగ్ : 3.64
ఈస్ట్ గోదావరి : 2.16
వెస్ట్ గోదావరి : 1.92
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 28.13 కోట్లు (షేర్)
కర్ణాటక : 5.32
ఓవర్సీస్ : 5.4
రెస్టాఫ్ ఇండియా : 1.25
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 40.10 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news