Gossipsదీపికా షాకింగ్ లుక్.. పిచక్ ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్..!

దీపికా షాకింగ్ లుక్.. పిచక్ ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్..!

బాలీవుడ్ హీరోయిన్స్ లో టా రేంజ్ లో ఉన్న దీపికా పదుకునే లాస్ట్ ఇయర్ రణ్ వీర్ సింగ్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు కొత్తగా వెరైటీ రోల్స్ పోశించాలని చూస్తుంది. అందులో భాగంగా దీపికా యాసిడ్ దాడికి గురై.. ఆత్మ విశ్వాసాన్ని పోగేసుకుని నిజ జీవితంలో గెలిచిన లక్ష్మి అగర్వాల్ కథతో ఓ సినిమా వస్తుంది. మేఘనా గుల్జార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నరు. ఈ సినిమాకు టైటిల్ గా పిచక్ అని ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు.. 2020 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ఫస్ట్ లుక్ లో దీపిక సర్ ప్రైజ్ చేసింది. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ప్రేమని తిరస్కరించిందని 32 ఏళ్ల వయసులో నదీం సయ్యద్ లక్ష్మీ మీద యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె తనలాంటి బాధితులకు అండగా నిలబడుతుంది.

ఇన్నాళ్లు గ్లామరస్ గా మాత్రమే నటించి మెప్పించిన దీపికా మొదటిసారి కెరియర్ లో ఓ ఛాలెజింగ్ రోల్ చేస్తుంది. ప్రొస్థెటిక్ మేకప్ తో యాసిడ్ దాడి జరిగిన మహిళగా దీపిక ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. అయితే మేకప్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని దీపిక చాలా హోప్స్ పెట్టుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news