Gossips" Dear కామ్రేడ్ " ట్రైలర్.. దుమ్ములేపుతున్న విజయ్ దేవరకొండ..

” Dear కామ్రేడ్ ” ట్రైలర్.. దుమ్ములేపుతున్న విజయ్ దేవరకొండ..

యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ పిక్చర్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు సినిమా ట్రైలర్ మరింత క్రేజ్ తెచ్చింది.

కాకినాడ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్ లో విజయ్ క్యారక్టర్ మరో సంచలనంగా మరేలా ఉంది. చివర్లో నన్ను భయపెడుతున్నారనుకుంటున్నారేమో మీరే భయపడుతునారంటూ సిగరెట్ తాగొతూ చెప్పిన డైలాగ్ అదుర్స్. సినిమా గురించి ఇంత కన్నా చెప్పేందుకు ఏం లేదు. డియర్ కామ్రేడ్ మరో సూపర్ హిట్ గా విజయ్ ఖాతాలో పడబోతుంది.

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారి అర్జున్ రెడ్డితో అదరగొట్టిన విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో సంచలన విజయం అందుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా డియర్ కామ్రేడ్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. ట్రైలర్ అదరగొట్టగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news