Newsఇరగదీసిన బన్నీ.. సినిమా చూపించడమంటే ఇదేనేమో!

ఇరగదీసిన బన్నీ.. సినిమా చూపించడమంటే ఇదేనేమో!

Allu Arjun’s ‘cinema chupista maava’ song has sets a new record on youtube among all telugu movies. this song has released in last year may has reached more than 1.9 crore views. Soon it will touch 2 crores mark which is biggest figure. This song in Race Gurram movie which is directed by Kick Surender Reddy.

సోషల్ మీడియాలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తర్వాత భారీ ఫాలోయింగ్ కలిగివున్న తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది స్టైలిస్ స్టార్ అల్లుఅర్జున్ అని చెప్పాలి. ఎందుకంటే.. గత మూడేళ్ళలో వరుసగా నాలుగు విజయాలు అందుకుని ఈ హీరో తన క్రేజ్‌ని అమాంతం పెంచుకున్నాడు. విశేషం ఏమిటంటే.. వాటిలో మూడు చిత్రాలు రూ.50 కోట్ల షేర్, ఒకటి (సరైనోడు) రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాయి. దాంతో.. బన్నీ రేంజ్ ఓ స్థాయికి చేరింది. ఈ క్రేజ్ కారణంగానే.. బన్నీ తన ఖాతాలో ఓ సంచలన రికార్డ్‌ని జమ చేసుకున్నాడు.

బన్నీ కథానాయకుడిగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘సినిమా చూపిస్త మావ’ అనే పాట అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. కొన్నా్ళ్లపాటు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఆ పాట. యూట్యూబ్‌కి అయితే ఇప్పటికీ సినిమా చూపిస్తూనే ఉంది. ఈ పాట మత్తులోనే నెటిజన్లు ఇంకా మునిగితేలుతుండడంతో.. ఇదో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ (1.9 కోట్లు) తెచ్చుకున్న పాటగా చరిత్ర సృష్టించింది. క్యాచీ లిరిక్స్, అదిరిపోయే ట్యూన్, బన్నీ ఎనర్జీ, శృతి గ్లామర్‌తోపాటు చిత్రీకరణ సరదాగా ఉండడం వల్లే ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ పాటకి వస్తున్న ఆదరణ బట్టి చూస్తుంటే.. త్వరలోనే 2 కోట్ల మార్క్‌ని కూడా సునాయాసంగా దాటేస్తుందని తెలుస్తోంది.

కాగా.. బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లాన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news