Moviesచాణక్య మూవీ రివ్యూ & రేటింగ్

చాణక్య మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: చాణక్య
నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్ పిర్జాదా, జరీన్ ఖాన్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పలనిసామి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: తిరు

మ్యాచో స్టార్ గోపీచంద్ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్న గోపీచంద్ ‘చాణక్య’ అనే సినిమాతో మనముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చాణక్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేస్తున్న అర్జున్(గోపీచంద్) దేశంలో అలజడి సృష్టించే గ్యాంగ్‌లను అంతం చేస్తుంటాడు. ఈ క్రమంలో అర్జున్‌ ఓ ఆపరేషన్‌ కోసం పాకిస్థాన్ వెళతాడు. అక్కడ గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకునేందుకు అర్జున్ చేసిన సాహసాలు ఏమిటి..? అర్జున్ ఆపరేషన్‌లో అతడికి ఎవరు సాయం చేస్తారు..? చివరకు అర్జున్ ఆపరేషన్‌ను ఎలా ముగించాడు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
యాక్షన్ హీరోతో ఎలాంటి సినిమా చేయాలో అలాంటి సినిమాను మనకు అందించాడు దర్శకుడు తిరు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తిరు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. రా ఏజెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చాణక్య సినిమా పూర్తిగా మైండ్ గేమ్‌తో నడుస్తుంది. అర్జున్ పాత్రలో గోపీచంద్ చేసిన యాక్టింగ్‌కు జనాలు ఇంప్రెస్ అవుతారు. ఫస్టాఫ్‌లో హీరో పాత్ర ఇంట్రొడక్షన్ మొదలుకొని అతడి లవ్ ట్రాక్‌, పలు ట్విస్టులతో ఇంటర్వెల్‌ వరకు కథను తీసుకెళ్లాడు డైరెక్టర్.

సెకండాఫ్‌లో ఆపరేషన్ కోసం పాకిస్థాన్ వెళ్లిన హీరో అక్కడ ఏం చేశాడన్నది బాగా చూపించారు. చాణక్యుడి లాంటి తెలివితో విలన్ల పని ఎలా పట్టాడనేది సెకండాఫ్‌లో చూపించారు. ఈ క్రమంలో అర్జున్ చేసే యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులతో సినిమాను ముగించాడు దర్శకుడు.

ముందు నుండీ చాణక్య సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చూపించడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు గోపీచంద్ యాక్టింగ్ జతకలిసి చాణక్య సినిమాను మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి.

నటీనటులు పర్ఫార్మెన్స్:
గోపీచంద్ ఎప్పటిలానే తన నటనతో మెప్పించాడు. అండర్ కవర్ ఏజెంట్‌గా ఆయన యాక్టింగ్ బాగుంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు అదే పాత గోపీచంద్‌ను తలపించాడు. ఎక్కడా కొత్తదనం లేకపోవడంతో గోపీచంద్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు. హీరోయిన్‌ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కేవలం పాటల కోసమే ఉన్నట్లు అనిపించింది. ఆమెకు నటనపరంగా పెద్ద స్కోప్ లేదు. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ఉన్నంతలో మెప్పించింది. ఆలీ కామెడీతో మెప్పించాడు. మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగ నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
అసిస్టెంట్ డైరెక్టర్ నుండి దర్శకుడిగా మారిన తిరు రొటీన్ కథను ఎన్నుకోవడంతో సినిమాకు కొత్తదనం లేకుండా పోయింది. నటీనటులను అనుకున్న స్థాయిలో వాడుకోలేకపోయాడు. కొన్ని సీన్స్‌ను ఎందుకు పెట్టాడో కూడా తెలియకుండా ఉన్నాయి. కథనంలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ఆడియెన్స్‌ తలలు పట్టుకుంటారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం సినిమాకు కాస్త తోడయ్యింది. ముఖ్యంగా బీజీఎం వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
చాణక్య – గోపీచంద్ గురి మిస్ అయ్యింది

రేటింగ్:
2.5/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news