Gossips‘బుర్రకథకు’ సెన్సార్ కష్టాలు..!

‘బుర్రకథకు’ సెన్సార్ కష్టాలు..!

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్,నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా ‘ప్రేమ కావాలి’సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో హీరోగా పరవాలేదు అనిపించుకున్న సాయి తర్వాత నటించిన ఏ సినిమాలు కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అంతే కాదు ఇటీవల కాలంలో సినిమా ఛాన్సులు కూడా బాగా తగ్గాయి. తాజాగా రచయిత డైమండ్ రత్నబాబు డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’.

దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ మూవీ నేడు రిలీజ్ కావాల్సి ఉంది. సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ జూన్ 28 నుంచి జూన్ 29కు షిఫ్ట్ అయిందని నిన్న చిత్ర బృందం వెల్లడించింది.

అయితే రేపు రిలీజ్ కావడం కూడా కష్టమే అంటున్నారు..అంతేకాదు త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌‌ను వింటేజ్ క్రియేష‌న్స్ ద‌క్కించుకుని సినిమాను విడుదల చేస్తోంది. మిస్తీ చక్రబోర్తి , నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news