News ఎన్టీఆర్‌పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్‌పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్

Producer Bandla Ganesh created new sensation by saing that he got losses with NTR’s Baadshah movie.

చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి బ్లాక్‌బస్టర్ నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్.. యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’, ‘టెంపర్’ సినిమాలు చేశాడు. అలాంటిది.. వారిమధ్య గతంలో ఏవో వివాదాలు రాజుకున్నాయి. దాంతో.. వారిరువురి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అసలు వాళ్లు విడిపోవడానికి గల కారణాలేంటో ఇంతవరకు ఎవరికీ స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. ఇన్నాళ్ల తర్వాత ఆ గొడవపై నిర్మాత బండ్లగణేష్ పెదవి విప్పాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో.. ఆరోజుల్లో తనకి, తారక్‌కి మధ్య రాజుకున్న విభేదాలపై పెదవి విప్పాడు. ఈ వీడియో ఇంకా పూర్తిగా రాలేదు కానీ.. రెండు ప్రోమోలు మాత్రమే విడుదల అయ్యాయి. ఒక వీడియోలో బండ్ల ఆ వివాదం గురించి పూర్తిగా ఏం మాట్లాడాడో రివీల్ అవ్వలేదు కానీ.. అతను లేవనెత్తిన ఓ అంశం మాత్రం మరో సంచలనానికి తెరతీసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

ఇంతకీ బండ్ల ఏం చెప్పాడంటే.. 2013లో తారక్‌తో తాను చేసిన ‘బాద్‌షా’ సినిమాతో ఆర్థికంగా నష్టపోయానని బండ్ల అన్నాడు. అదే.. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాని బండ్ల 55 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. మంచి అంచనాల మధ్యే విడుదల అయిన ఆ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అనుకున్నారు. కానీ.. ఆ స్థాయిలో వసూళ్లు రాలేదు. దాంతో.. బండ్ల గణేష్ నష్టపోయాడు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. బాద్‌షాతో పాటు బండ్ల నిర్మించిన ఇతర చిత్రాల్లో కొన్ని నష్టాలు తెచ్చిపెట్టాయి కదా.. వాటి గురించి ఎందుకు మాట్లాడలేదంటూ అతనిపై విరుచుకుపడుతున్నారు. అసలు బండ్ల ‘బాద్‌షా’ మూవీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడో తెలియాలంటే.. పూర్తి ఇంటర్వ్యూ వీడియో వచ్చేవరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news