Gossipsఆహా..బాలయ్య మల్టీస్టారర్ విత్ బోయపాటి! మరో స్టార్ హీరో...

ఆహా..బాలయ్య మల్టీస్టారర్ విత్ బోయపాటి! మరో స్టార్ హీరో ఎవరు ?

ఓ ఊహించ‌ని కల‌యిక ప్రేక్ష‌కుల ముందుకు రానుంది
అటు ఎన్టీఆర్ ఇటు కృష్ణ అభిమానులు పండుగ చేసుకునే వార్త ఒక‌టి ఇండ‌స్ట్రీలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది..
గ‌తంలో ఆ ఇద్ద‌రి క‌ల‌యిక సూప‌ర్ హిట్.. ఇప్పుడీ త‌రంలో ఈ ఇద్ద‌రి క‌ల‌యిక ఎన్ని సంచ‌నాల‌ను న‌మోదు చేస్తుందో చూడాలిక …
వివ‌రాలిలా :: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీస్ వ‌రుస క్యూక‌డుతున్నాయి.‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’..‘గోపాల గోపాల’.. ‘మసాలా’..‘ఊపిరి’ చిత్రాలే తా ర్కాణాలు. తాజాగామరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా మల్టీస్టారర్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నలిచ్చాడు. ఇది క‌నీవినీ ఎరుగుని కాం బినేష‌న్ అని టీ టౌన్ కోడై కూస్తోంది.ఓ ఇద్దరు టాప్ హీరోలను క‌లిపే బాధ్య‌త మాస్ దర్శకుడు బోయపాటి శ్రీ‌ను తీసుకున్నాడు.త‌న‌దైన స్టైల్ లో ఓ మల్టీస్టారర్ మూవీ సెట్ చేశాడు. బాల‌య్య‌ని, మ‌హేశ్ బాబుని ఇద్ద‌రికీ ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు క‌థ సిద్ధ‌మైంది.మ‌హేశ్ కూడా ఆయ‌న‌తో నటిం చేందుకు సై అంటున్నాడు. ఇప్ప‌టికే బోయ‌పాటి బాల‌య్య తో సింహ‌, లెజెండ్ చిత్రాల‌తో వ‌రుస హిట్లు కొట్టి త‌న‌దైన మార్కుకు తిరుగులేద‌ని నిరూపించాడు. ఇప్పుడీ మ‌ల్టీస్టారర్ మాస్ మ‌సాలాకు ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇవ్వ‌నున్నాడో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం. కొత్త ఏడాదిలో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news