Gossipsఅజ్ఞాతవాసి 2 డేస్ కలెక్షన్స్ .. తారుమారైన అంచనాలు

అజ్ఞాతవాసి 2 డేస్ కలెక్షన్స్ .. తారుమారైన అంచనాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ కు ఉన్న్ర్ క్రేజ్ దృష్ట్యా ఆ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువని చెప్పొచ్చు. మొన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి మొదటి రోజు రికార్డుల బద్ధలు కొట్టింది. ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారానే 1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది అజ్ఞాతవాసి. ఇక ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 28.50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసిందట.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల దాకా చేయగా సినిమా నైజాం లోనే 29 కోట్లకు బిజినెస్ చేసింది.

కానీ రెండొవ రోజు మాత్రం దీనికి విభిన్నంగా మారింది.నెగిటివ్ టాక్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ తారుమారయ్యాయి.ఇక ప‌వ‌న్ సెకండ్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 38.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ వ‌సూళ్ల‌తో ప‌వ‌న్ కొత్త రికార్డు సెట్ చేశాడు. మరి ఈ సినిమా టోటల్ ఏరియా వైజ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. వారాంతరం కల్లా ఈ సినిమా 60 నుండి 80 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

http://www.telugulives.com/telugu/jai-simha-review/

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news