Moviesమిల్కీ బ్యూటీ కి కోపం వస్తే అంతా తెలుగులోనే .. మనసులో...

మిల్కీ బ్యూటీ కి కోపం వస్తే అంతా తెలుగులోనే .. మనసులో మాట బయటపెట్టేసిందిగా..?

టాలీవుడ్ లో అడిగిపెట్టిన చాలామంది నార్త్ అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిల్లాగా మారిపోయిన వారే .. అందరికీ నమస్తే చెప్పి రెండు ముక్కలు తెలుగు మాట్లాడే హీరోయిన్లు కాదు వీరు .. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే తెలుగు భాషలో పట్టు సాధించి చక్కగా మన భాషలో మాట్లాడుతూ మన అభిమానుల మనసు గెలుచుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు . తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖ‌న్నా ఈ జాబితాలో చాలామంది కనిపిస్తారు . అయితే వీరిలో తమన్నా కెరియర్ మొదట్లోనే తెలుగు మీద ప‌ట్టు తెచ్చుకుంది . అలా పలు సినిమాల్లో సొంతంగా తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది .Telugu Times | International Telugu Newsఈ మిల్కీ బ్యూటీ ఎక్కువగా సినిమాలు చేసింది కూడా తెలుగులోనే అన్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఈమధ్య టాలీవుడ్లో ఈమె సినిమాలు కాస్త తగ్గాయి .. తన కొత్త సినిమా ఒద్దుల 2 మంచి బజ్‌ తెచ్చుకుని ఏప్రిల్ 15న రిలీజ్ కు రాబోతుంది .. ఈ విషయాలన్నీ చెబుతూ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ పెట్టగా .. ఇక అందులో తను సంపాదించుకున్న తెలుగు ఐడెంటి గురించి తమన్న చెప్పుకొచ్చింది .. తాను దేశంలో ఏ ప్రదేశానికి వెళ్ళిన అక్కడ నన్ను తెలుగమ్మాయిగానే చూస్తున్నారని తమన్న చెప్పుకొచ్చింది .. అలాగే తన‌కు తాను తెలుగు అమ్మాయిల భావిస్తున్నాని కూడా ఆమె అంటుంది .. తెలుగు సినిమాలతో పాటు ఇక్కడ అభిమానుల‌తో తనకు ఎంతో కనెక్షన్ ఉందని తమన్నా తన మనసులో మాటను బయటపెట్టింది .Odela 2 teaser: A faceoff between the devil and divine force | Telugu Cinemaఅలాగే తానకు తెలుగు ఎంతగా అలవాటు పడిపోయానో చెబుతూ తనకు కోపం వస్తే తిట్లు కూడా తెలుగులోనే వస్తున్నయి అంటు ఆమె చెప్పకు వచ్చింది . అలాగే ఈమధ్య ఒక సందర్భంలో తన డ్రైవర్ మీద కోపం వస్తే తెలుగులోనే తిట్టినట్టు కూడా ఆమె చెప్పకు వచ్చింది అప్పుడే తన జీవితంలో తెలుగు ఎలా ప్రభావం చూపించిందో తనకు అర్థమైందని తమన్నా చెప్పింది . అలాగే ఈవెంట్లో సినుమా నిర్మాత దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ తమన్న డెడికేషన్ ఎలాంటిదో చెప్పారు రచ్చ‌ సినిమాలో వానపాట కోసం తమన్న ఎంత కష్టపడ్డారో తనకు మాత్రమే తెలుసు అని కూడా ఆయన చెప్పాడు . ఇక ఇప్పుడు ఓదెల 2 షూటింగ్ హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని 47 డిగ్రీల ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా షూటింగ్లో పాల్గొంద‌ని.. ప‌దేళ్ల ముందు రచ్చ‌ చేస్తున్న టైంలో ఎలాంటి డెడికేషన్ ఉందో ఇప్పుడు అంతే హార్డ్ వర్క్ తో చేస్తుది .. ఎంత పెద్ద స్టార్ అయినా తనలో ఏ మార్పు లేదని సంపత్ నంది చెప్పుకొచ్చారు . ఇక మరి బాక్సాఫీస్ వద్ద ఓదెలా 2 ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.

Latest news