Moviesఇది కదా రా రియల్ హీరోకి ఉండాల్సిన స్టామినా..మహేష్ ఇలాకాలో ప్రభాస్...

ఇది కదా రా రియల్ హీరోకి ఉండాల్సిన స్టామినా..మహేష్ ఇలాకాలో ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్..!

ఇది నిజంగా రెబెల్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి . నిన్న మొన్నటి వరకు ప్రభాస్ హిట్టు కొట్టలేదు అంటూ ట్రోల్ చేశారు . బాహుబలి తర్వాత అసలు అలాంటి హిటే లేదు. ఇక ప్రభాస్ తన సినీ కెరియర్ కి గుడ్ బై చెప్తే బెటర్ అంటూ కూడా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క సినిమా ప్రభాస్ తలరాతనే మార్చేసింది . కాదు కాదు ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేసింది. ఒకటా రెండా వామ్మో ఎన్నెన్నో రికార్డ్స్ ..కల్కి సినిమాతో ప్రభాస్ బద్దలు కొట్టిన రికార్డులు అన్ని ఇన్ని కాదు .

నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా కల్కి . జూన్ 27వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేనా ప్రభాస్ ఇప్పటివరకు సాధించలేని ఎన్నో రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసి అనేక చోట్ల పలు రికార్డులు బద్దలు కొట్టేసింది . ఇక హైదరాబాద్ గురించి అయితే చెప్పనవసరం లేదు . ఇప్పటివరకు ఏ హీరో క్రియేట్ చేయని రికార్డ్స్ కూడా క్రియేట్ చేసి పెట్టేసింది .

కల్కి సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అన్ని థియేటర్స్ కళకళలాడుతున్నాయి. వీకెండ్ మూడు రోజులు హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా దర్శనమిచ్చాయి . తాజాగా కల్కి సినిమాతో హైదరాబాదులోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ కనీ విని ఎరుగని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు చెందిన ఆంభ్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ లో 7 స్క్రీన్స్ ఉన్నాయి. ఇక కల్కి రిలీజ్ రోజు నుంచి అన్ని స్క్రీన్స్ లో కలిపి ఆల్మోస్ట్ ఆల్ 40 షోల వరకు పడ్డాయి. అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. అంతే కాకుండా ఆంభ్లో ఒక కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఆశ్చర్యం ఏంటంటే..మహేష్ థియేటర్లో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. ఇదే ఇక్కడ హైలేట్ మ్యాటర్. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news