Moviesబాహుబలి, RRR రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఆ సినిమా కే...

బాహుబలి, RRR రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఆ సినిమా కే ఉంది..రానా సంచలన కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమాకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో మనందరికీ తెలిసిందే . దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర రికార్డును బ్రేక్ చేసింది . ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి – ప్రభాస్ కి – రానా దగ్గుబాటికి స్పెషల్ క్రేజ్ ని తీసుకొచ్చింది . ఈ సినిమా తర్వాత బాహుబలి పాత్రలో మెరిసిన ప్రభాస్ ఏ స్థాయికి ఎదిగిపోయాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఒక్కో సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ టాప్ హీరోగా చలామణి అవుతున్నాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ సినిమా పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాహుబలి రికార్డులను ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బీట్ చేసే సత్తా ఆ ఒక్క సినిమాకి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆ కామెంట్లు వైరల్ గా మారాయి.

ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ప్రాజెక్టు కె. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ – కమలహాసన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీపిక పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . ఫుల్ సైంటిఫిక్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 12 – 1 -2024న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news