Moviesఅభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ ..తల్లి కాబోతున్న మరో స్టార్...

అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ ..తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. !!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు ..అంతే త్వరగా గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి షాక్ ఇస్తున్నారు . కాగ బాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆలియా భట్ పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజుల్లో ఇలాంటీ యవ్వారాలు కామన్ అంటూ లైట్ తీసుకున్నారు అభిమానులు . పొలిటికల్ లీడర్ ఫహద్ అహ్మద్ తో రిజిస్ట్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ కూడా అదే రూట్లోకి వెళ్ళింది .

పెళ్లి ఎంత త్వరగా చేసుకుందో..అంతే త్వరగా ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసింది . ఈ తంతు ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది.. బిడ్డను కనడానికి ఇష్టపడింది . తాజాగా ప్రెగ్నెన్సీ గురించి అఫీషియల్ గా ప్రకటించింది . “కొన్నిసార్లు మీ ప్రార్ధనలు అన్నిటికీ సమాధానం లభిస్తుంది . మేము సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషం గా ఉన్నాం. మీ ఆశీర్వాదం -కృతజ్ఞత – ఉత్సాహం కలగలిసిన అనుభూతితో ఉన్నాము”.. అని భర్త వెనుక నుంచి తను హగ్ చేసుకుని ఉన్న బేబీ బంప్ ఫోటోను షేర్ చేసింది .

దీనితో అభిమానులు షాక్ అయిపోతున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇంత బేబీ బంప్ ఎలా వచ్చింది..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది కంగ్రాట్యులేషన్స్ అంటూ విష్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో స్వర భాస్కర్ దేవి బేబీ బాంప్ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఏది ఏమైన ఈ మధ్య కాలంలో స్టార్ బ్యూటీస్ త్వరగానే పిలలని కనడానికి లైక్ చేస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news