NewsNtv No.1 Channel: తెలుగు న్యూస్ ప్ర‌పంచంలో ఎన్టీవీ స‌రికొత్త రికార్డ్‌..!

Ntv No.1 Channel: తెలుగు న్యూస్ ప్ర‌పంచంలో ఎన్టీవీ స‌రికొత్త రికార్డ్‌..!

తెలుగు న్యూస్ ప్ర‌పంచంలో ప‌దుల సంఖ్య‌లు దాటేసిన న్యూస్ ఛానెల్స్ ఇప్పుడు వంద సంఖ్య‌ను కూడా క్రాస్ చేసేశాయి. ఇప్పుడున్న ఉరుకు ప‌రుగుల ప్ర‌పంచంలో ఓ న్యూస్ ఛానెల్ సంవ‌త్స‌రాల పాటు నెంబ‌ర్ 1 పొజిష‌న్లో కంటిన్యూ అవ్వ‌డం అంటే ఎంతో ద‌మ్ము, స‌త్తా ఉండి ఉండాలి. ఈ రోజు అదే ఎన్టీవీ సొంత‌మైంది. అందుకే తెలుగు న్యూస్ ప్ర‌పంచంలో ఎన్టీవీ తిరుగులేని రారాజుగా స‌రికొత్త రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంటోంది.

ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. 24 గంట‌ల‌ వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలు ప్రసారం చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా వాస్త‌వ‌మైన‌ కంటెంట్‌తో మరోసారి త‌న స‌త్తా ఏంటో చాటుకుంది. ఛానెల్ మొద‌లు పెట్టిన నాటి నుంచే రోజు రోజుకు త‌న అభిమానుల‌ను పెంచుకుంటూ ఈ రోజు ఈ స్థాయిలో మ‌కుటం లేని మ‌హారాజులా తెలుగు న్యూస్ ప్ర‌పంచంలో టీవీగా నిలుచొంది ఎన్టీవీ.

మారుమూల ప‌ల్లెల నుంచి ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల వ‌ర‌కు ఖ‌చ్చిత‌మైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంత‌గా ప్రజాద‌ర‌ణ పొందింది. బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ లైవ్‌లో ఉండి రిపోర్ట్ చేయ‌డం, ఖ‌చ్చిత‌మైన స‌ర్వేల‌కు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవ‌లం త‌ప్పుడు ప్రచారాలు, అన‌వ‌స‌ర‌మైన సంచ‌ల‌నాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగ‌ల‌గ‌డం, ప్రజ‌లకు అవ‌స‌ర‌మైన విష‌యాల్ని వారి దగ్గర‌కు చేర్చడ‌మే అని న‌మ్మిన ఎన్టీవీకి ప్రజ‌లు నెం.1 స్థానాన్ని క‌ట్టబెట్టారు.

తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5 టీఆర్పీల‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ”ప్రతి క్షణం-ప్రజా హితం” అనే స్లోగ‌న్‌ను పెట్టుకుని, కేవ‌లం దాన్ని స్లోగ‌న్‌గా వ‌దిలేయ‌కుండా ప్రతిక్షణం ఆ మాట‌ మీద ఉండ‌ట‌మే ఎన్టీవీ ఈ స్థానానికి రావ‌డానికి కార‌ణం. దేనికీ బెద‌ర‌కుండా, ఎవ‌ర్నీ బెదిరించ‌కుండా ప్రజ‌ల పక్షాన నిల‌బ‌డుతుండ‌ట‌మే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిల‌బెడుతుంది. కాగా, ఎన్టీవీ నెం.1గా నిల‌వ‌డంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news