Movies"నేను స్టూడెంట్ సార్" రివ్యూ : బెల్లంకొండ హీరో హిట్టా..? ఫట్టా..?...

“నేను స్టూడెంట్ సార్” రివ్యూ : బెల్లంకొండ హీరో హిట్టా..? ఫట్టా..? సినిమా ఎలా ఉందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చిన్న హీరోలు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే . కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు బెల్లంకొండ గణేష్ . బెల్లంకొండ వార్సుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్ రీసెంట్గా చేసిన సినిమా “నేను స్టూడెంట్ సర్ “. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లేటెస్ట్ మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది .

కాగా “నాంది” వంటి సూపర్ హిట్ తర్వాత సతీష్ వర్మ ఈ సినిమా నిర్మించడంతో సినిమా పై ముందు నుంచే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో అవంతిక దస్సాని అని హీరోయిన్గా నటించి..తన అందచందాలతో మెప్పించింది . ఫస్ట్ షో తోనే ఈ సినిమా సూపర్ హిట్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలుచోట్ల ఫస్ట్ షో పూర్తయిపోయాయి.

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా సరదాగా ఉందని ..ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని.. సీన్ సీన్ కి సస్పెన్స్ క్రియేట్ చేశారని.. డైరెక్టర్ స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగుందని చెప్పుకొస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ సినిమాకి హైలైట్ గా మారిందని .. కొత్త కథతో చాలా బాగా సీన్స్ మలిచాడని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఎమోషనల్ కామెడీ లవ్ ట్రాక్ బాగా నడిపించాడని కామెంట్స్ చేస్తున్నారు . మొత్తంగా సస్పెన్స్ థ్రిల్లర్ కలిగించే విధంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీనితో రెండో సినిమాతోనే బెల్లంకొండ గణేష్ మంచి హిట్ కొట్టాడన్న టాక్ వినిపిస్తుంది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news