Moviesఆ స్టార్ హీరోల పై కోట శ్రీనివాస్ రావు ఫైర్.. బాత్రూం...

ఆ స్టార్ హీరోల పై కోట శ్రీనివాస్ రావు ఫైర్.. బాత్రూం బ్రష్ లు అంటూ ఘాటు కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో కోటా శ్రీనివాసరావు గారికి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ఇప్పుడు సినిమాల్లో నటించట్లేదు . వయసు మీద పడిపోతుంది.. అనారోగ్య కారణంగా కోట శ్రీనివాసరావు ఇంటికే పరిమితమయ్యారు . కాగా ఈ మధ్యకాలంలో తెరపై ఎక్కడా కనిపించని కోటా శ్రీనివాసరావు .. రీసెంట్గా ప్రెస్ మీట్ లో టాలీవుడ్ హీరోలపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి .

మరి ముఖ్యంగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే ఆయన టార్గెట్ చేసినట్లు ఫాన్స్ ఫైర్ అయిపోతున్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు మరి ఎక్కువ చేస్తున్నారు.. ఎంతటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో మనందరికీ తెలుసు . స్టార్ హీరోలో ఒక్కొక్కరు రెండు కోట్లు తీసుకుంటున్నామంటూ ఓపెన్ గా చెబుతున్నారు . అలాంటి వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటే సామాన్య నటులకు డబ్బులు ఎలా ఇస్తారు..? స్టార్ హీరోలు హీరోయిన్లే మొత్తం దోచుకునేస్తే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలా బతకాలి..? అంటూ ప్రశ్నించారు”.

అంతేకాదు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క స్టార్ సెలబ్రెటీ వాణిజ్య ప్రకటన చేస్తున్నారని ..బాత్రూం బ్రష్లను కూడా వదలట్లేదు అని వ్యంగ్యంగా కౌంటర్ వేశారు . ఒకప్పుడు ఇండస్ట్రీ స్టార్స్ గా పేరు సంపాదించుకునే ఎన్టీఆర్ , కృష్ణ , ఏఎన్ఆర్ , శోభన్ బాబు వీళ్ళు ఎవరు ఇంత రెమ్యూనరేషన తీసుకుంటున్నామని పబ్లిక్ గా చెప్పుకోలేదు “అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .

గతంలో ఓ ప్రచార సభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని కోటా శ్రీనివాసరావు టార్గెట్ చేశారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కోటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యల పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . దీంతో ఆయన పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news