Movies"రామ బాణం" పబ్లిక్ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

“రామ బాణం” పబ్లిక్ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ మ్యాంచో హీరో గా పేరు సంపాదించుకున్న యాక్ష‌న్ హీరో గోపీచంద్..ప్రజెంట్ పోజీషన్ ఎలా ఉందో మనందరికి తెలిసిందే. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లు..ఫిక్ ..టాలెంట్ ఉన్నా సరే హిట్లు అందుకోలేకపోతున్నాడు. గ‌త కొంత కాలంగా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా సరే..పాపం కాలం కలిసిరాక అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

కాగా ఈ క్రమంలోనే ఎలాగైన సరే హిట్ కొట్టాల్ని కసి తో పట్టుదలతో ..భారీ రేంజ్ లో ఎక్స్ పెక్టేష్నస్ తో ఓ సినిమా లో నటించాడు. అదే “రామ‌బాణం”. అవుట్ అండ అవుట్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొద్ది సేపటి క్రితమే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. గతంలో గోపీచంద్‌, డైరెక్ట‌ర్ శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం – లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన మూడో సినిమా రామ‌బాణం కావడంతో హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు అంద‌రిలోనూ ఉన్నాయి.

అయితే సినిమా యావరేజ్ టాక్ దక్కించుకుంది. కధ పాతదే అయినా..కొత్తగా చూపించాడు డైరెక్టర్ శ్రీవాస్. రొటీన్ స్టోరీ అయ్యినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా ద‌ట్టించాడ‌ట‌. అంతేకాదు డింపు హయాతి అందాలు సినిమా కి ప్లస్ గా మారాయి అంటున్నారు జనాలు. మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ అని చెప్పుకొస్తున్నారు. కామెడీ, యాక్ష‌న్ స‌మ‌పాళ్ల‌లో ద‌ట్టించార‌ని… అన్న‌ద‌మ్ముల సెంటిమెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయట‌. క్లాస్ అండ్ మాస్ టచ్ ఇచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చుతుంద‌ని.. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండ‌డంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సైతం న‌చ్చుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా రామబాణం సినిమాతో హిట్ కొట్టాడు మన గోపీచంద్ అనే చెప్పాలి. చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news