Moviesరామ్ చరణ్- ఉపాసన కూడా విడాకులు తీసుకోవాలి అనుకున్నారా..? అంత పెద్ద...

రామ్ చరణ్- ఉపాసన కూడా విడాకులు తీసుకోవాలి అనుకున్నారా..? అంత పెద్ద గొడవ జరిగిందా..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోపోతుంది . మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్. ప్రజెంట్ ఆమెకు 7వ నెల రన్ అవుతుంది . ఇలాంటి టైం లో రామ్ చరణ్ పై ఇలాంటి చెత్త రూమర్ వైరల్ అవ్వడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇది ఎవరో కొందరు ఆకతాయిలు క్రియేట్ చేసిన న్యూస్ అంటూ చెప్పుకు వస్తున్నారు మెగా ఫాన్స్ . మరి కొంతమంది ఈ వార్తలో నిజం లేకపోనూ లేదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో రాణిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన స్టార్ హీరోగా ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు గ్లోబల్ హీరోగా మారిపోయాడు. కాగా చరణ్ తన సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ నటించినా.. ఏనాడు హద్దులు క్రాస్ చేయలేదు . అయితే చరణ్ – కాజల్ మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో వీళ్ళు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో వీళ్ళ మధ్య ఏదో నడిచింది అన్న వార్తలు అప్పట్లో వైరల్ గా మారాయి.

కాజల్ ని రామ్ చరణ్ ప్రేమించాడు అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఉపాసన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రామ్ చరణ్ కాజల్ తో క్లోజ్ గా ఉండడం.. ఉపాసన కి నచ్చలేదట . ఈ క్రమంలోనే చరణ్ కి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడిందట . అయితే మెగాస్టార్ చిరంజీవి మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయ్యి మిస్ అండర్స్టాండింగ్ సాల్వ్ చేశారని అప్పట్లో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో వాళ్లకే తెలియాలి . ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ స్పందిస్తే ఆ వార్తల అక్కడితోనే ఆగిపోతాయి . లేదంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి దయచేసి ఇలాంటి వార్తల పై స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news