Moviesఫ్యామిలీ మ్యాన్ 2 వల్లే విడాకులు ? ఇన్నాళ్లకు ఓపెన్ అప్...

ఫ్యామిలీ మ్యాన్ 2 వల్లే విడాకులు ? ఇన్నాళ్లకు ఓపెన్ అప్ అయిన చైతూ.. సమంతకి క్లారిటీ ఇచ్చినట్లేనా..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య.. స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత డివర్స్ మ్యాటర్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో నాగచైతన్య – సమంతల పేర్లు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనకు బాగా తెలిసిందే.

కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ .. “సమంతతో విడాకులు తీసుకుంది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల కారణంగానే “అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కామన్ పీపుల్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పై మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కారణంగా మీరు విడాకులు తీసుకోవడానికి చిన్న పిల్లలా..? అంత నంగలా..? అంటూ రివర్స్ కౌంటర్ చేస్తున్నారు .

అంతేకాదు రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు సమంత నటించిన ఫేవరెట్ సినిమాలపై ఓ ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే సమంత నటించిన “ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్, మజిలీ , శాకుంతలం, ఏమాయ చేసావే”.. సినిమాలు బాగా నచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో “ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ” లో సమంత బోల్డ్ గా నటించిన కారణంగానే వాళ్ళు విడాకులు తీసుకున్నారు అన్న రూమర్లకు చెక్ పెట్టిన్నత్లైంది. వాళ్ళు విడాకులు తీసుకుంది కేవలం పుకార్ల వల్లనే అంటూ క్లారిటీ ఇచ్చాడు చైతన్య . ఆశ్చర్యం ఏంటంటే ఆ రీజన్ ని అక్కినేని ఫ్యాన్స్ కూడా నమ్మట్లేదు . దీంతో ఏదో ఇద్దరి మధ్య బాగానే గొడవ జరిగింది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . మొత్తంగా మరోసారి నాగచైతన్య – సమంతల విడాకుల మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news