Movies"ఇది మీ కోసమే నాన్న"..కృష్ణ బర్త్‌డే నాడు మహేష్ బాబు స్పెషల్...

“ఇది మీ కోసమే నాన్న”..కృష్ణ బర్త్‌డే నాడు మహేష్ బాబు స్పెషల్ ట్వీట్..వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి చెరగని స్థాయిని తీసుకొచ్చిన కృష్ణ గారి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కొడుకు మహేష్ బాబు నాన్నని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే నాన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు మహేష్ బాబు నటించిన సినిమాకి సంబంధించిన టైటిల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్ . ఇవాళ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన “మోసగాళ్లకు మోసగాడు” సినిమాని థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ..గ్లింప్స్ ని కూడా ఆ ధియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే నాన్నను తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ అవుతూ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ..”తలకు రెడ్ టవల్ కట్టుకొని ..ఫుల్ మాస్ లుక్ లో ..ఫైట్ కి సిద్ధమవుతున్నట్లు ఉన్న స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. “ఇది మీకోసమే నాన్న”..” అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఆయన పోస్ట్ చేసిన పిక్స్ సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news