Movies"అందులో మా మహేశ్ బాబు తోఫు..కెవ్వు కేక".. టాప్ సిక్రేట్ బయట...

“అందులో మా మహేశ్ బాబు తోఫు..కెవ్వు కేక”.. టాప్ సిక్రేట్ బయట పెట్టిన బాబాయ్ ..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ప్రెసెంట్ ఎస్ఎస్ ఎం బి 28 అనే సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు త్వరలోనే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో మరో ఆస్కార్ పక్క ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అంటూ మహేష్ బాబు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన చిన్న న్యూస్ కూడా ఇట్టే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది .

రీసెంట్గా మహేష్ బాబు “మోసగాళ్లకు మోసగాడు” అనే ట్రైలర్ ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కృష్ణ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఆయన పుట్టిన రోజు సందర్భంగా మే 31న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . 4క్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై జనాలు మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మహేష్ బాబు గారి బాబాయ్ ఆదిశేషగిరి రావు..మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు .

ఆయన మాట్లాడుతూ..” మహేష్ బాబు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ అల్లరి అల్లరిగా ఉంటాడు. ఎంతో టాలెంటెడ్.. మహేష్ నటించిన వంశీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది నేనే ..నిజానికి మహేష్ నమ్రతల పెళ్లి జరపడానికి కారణం నేను అనుకుంటారు.. అయితే అందులో వాస్తవం లేదు .. మహేష్ -నమ్రతల పెళ్లి జరగడానికి కర్త – కర్మ – క్రియ అంతా ఇందిరాదేవి గారే.. మహేష్ బాబుకి అమ్మంటే చాలా ఇష్టం . కాగా ఇండియన్ ఫస్ట్ కౌబాయ్ ఫిలిం గా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు సినిమా మళ్లీ రిలీజ్ చేస్తూ ఉండడం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి క్రమంలోనే మహేశ్ బాబు లో స్పెషల్ టాలెంట్ ని కూడా బయట పెట్టాడు . మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి మహేష్ బాబుకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే మహేష్ బాబులో నటుడే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు .ఈ విషయం ఎవరికీ తెలియదు ఎలాంటి వ్యక్తినైనా సరే మిమిక్రీ చేసి మెప్పించగలరు అంటూ ఎవరికి తెలియని టాప్ సీక్రెట్ ను బయట పెట్టాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news