Newsఇష్టం లేకుండానే మనసు చంపుకుని..చివరికి అలాంటి పని కూడా చేసిన ప్రభాస్..అందుకే...

ఇష్టం లేకుండానే మనసు చంపుకుని..చివరికి అలాంటి పని కూడా చేసిన ప్రభాస్..అందుకే రెబల్ హీరో అయ్యాడా..?

సినిమా ఇండస్ట్రీ లోకి రావడం గొప్ప విషయం కాదు.. వచ్చిన తర్వాత అవకాశాలు అందుకోవడం ..ఆ అవకాశాలు పదికాలాలపాటు అలాగే వస్తూ ఉండేలా చేసుకోవడం.. నిజమైన హీరో హీరోయిన్ల లక్షణం. అయితే అందులో అందరు సక్సెస్ అవుతారా ..? అంటే లేదనే చెప్పాలి. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫెయిల్ అయిన దాఖలాలు ఉన్నాయి . వాళ్లలో ఒకరే రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ . యస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో ఒక హిట్ కొట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డారో తెలిసిందే.

ఒకానొక టైం లో ప్రభాస్ కు వరుస డిజాస్టర్లు పడుతూనే వచ్చాయి. డైరెక్టర్ లు సైతం ప్రభాస్ సినిమా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది . అలాంటి టైంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆయనకు పూజలు చేయమంటూ సజెస్ట్ చేశారట . మొదటి నుంచి దేవుని పెద్దగా నమ్మని ప్రభాస్.. ఆ విషయంలో చాలా మొండి చేశారట . అయినా సరే ప్రభాస్ పెద్దమ్మ ఆయనతో బలవంతంగా పూజలు చేయించిందట. ప్రభాస్ టాలెంటో .. ఆ దేవుడి పుణ్యమో తెలియదు కానీ ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి.

అంతేకాదు ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్ . ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది. రీసెంట్గా ప్రభాస్ నటించిన ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది . అయితే అభిమానులు ఈ ట్రైలర్ పై అంత సాటిస్ఫాక్షన్ గా లేరు . కచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం ముందే జోష్యం చెప్పేస్తున్నారు. చూడాలి మరి సినిమా హిట్ అయ్యాక కధ ఎలా మారుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news