Moviesపెళ్లి - పెటాకులు లేకుండా ముమైత్ ఖాన్ ..ఇలా సింగిల్ గా...

పెళ్లి – పెటాకులు లేకుండా ముమైత్ ఖాన్ ..ఇలా సింగిల్ గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్ లు ఉన్నారు. యంగ్ హీరోయిన్స్ ఉన్నారు . అయితే వాళ్లందరికీ లేని స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఐటమ్ గర్ల్ గా పేరు సంపాదించుకున్న ముమైత్ ఖాన్ . ఈ పేరు గురించి ఇప్పుడు జనాలు మర్చిపోయారేమో కానీ .. ఒకప్పుడు మాత్రం ఈ పేరు చెప్తే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే వాళ్ళు .. మంచంలో ఉన్న ముసలాడు సైతం కర్ర పట్టుకొని ఊగిపోయేవాడు.

మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన పోకిరి సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి తన పేరుని ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీగా మార్చేసుకుంది ముమైత్ ఖాన్ . అప్పట్లో “ఇప్పటికింకా నా వయసే ” పాట ఎంత సంచలనాలు సృష్టించిందో ఎన్ని ప్రబంజనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ తర్వాత ముమైత్ ఖాన్ సినిమాలో నటించిన.. పలు సినిమాల్లో డాన్స్ చేసింది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనింది. అయినా సరే ముమైత్ ఖాన్ పేరు ఎందుకు ట్రాక్ లోకి పడలేదు.

అందరు ముమైత్ ఖాన్ ని ఐటమ్ గర్ల్ గా చూసారే తప్పిస్తే ఎక్కడ ఆమె ను ఓ నటిగా గుర్తించలేకపోయారు. అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన ముమైత్ ఖాన్ ..అసలు ఏం చేస్తుందో ఎక్కడ ఉందో కూడా జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది. కాగ ముంబైలో పుట్టి పెరిగిన ముమైత్ ఖాన్ సినిమాలో అవకాశాలు రాకపోవడంతో తన ఊరికి వెళ్ళిపోయిందని అక్కడే సెటిలైపోయిందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఖాన్.. ఈ క్రమంలోనే హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఘాటుగా జవాబు ఇచ్చింది.

మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది . ముమైత్ ఖాన్ మాట్లాడుతూ ..”నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు.. పెళ్లయిన తర్వాత నుంచి అబ్బాయిలు మారిపోతారు . పిల్లల్ని కనాలని టరచర్ కి గురి చేస్తారు . పైగా మోటివేషన్ ఎంకరేజ్మెంట్ లాంటిది ఏవి దొరకవు . ఏ పని చేయాలన్న అడ్డుగా ఉంటారు . మొదట్లో నాకు పెళ్లి పై చాలా గౌరవం ఉండేది . ఆ తర్వాత అది పోయింది. అందుకే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా లేను “అంటూ బోల్డ్ గా స్పందించింది . దీంతో ముమైత్ ఖాన్ మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news