Moviesమందు తాగించి మరి ఆ హీరోయిన్ ని టార్చర్ చేసాడా..? రాఘవేంద్రరావులో...

మందు తాగించి మరి ఆ హీరోయిన్ ని టార్చర్ చేసాడా..? రాఘవేంద్రరావులో ఈ యాంగిల్ కూడా ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ రాఘవేందర్ రావు గారికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఈయన అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఈయన డైరెక్షన్లో ఒక్క సినిమా చేసిన చాలు అంటూ తాపత్రయపడుతూ ఉంటారు . దానికి కారణం ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా.. సీనియర్ స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలేస్స్తున్న ముద్దుగుమ్మలు అందరిని ఇంట్రడ్యూస్ చేసింది రాఘవేంద్రరావు గారే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు అని చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది హీరోయిన్స్ నాభి అందాలు.

హీరోయిన్స్ బొడ్డుపై రక రకాల పూలు పండ్లు వేయడంలో రాఘవేంద్రరావు చాలా ధిట్టా అని అందరూ అంటుంటారు . దానికి తగ్గట్టే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. కాగా రాఘవేంద్రరావు రమ్యకృష్ణకు ఎలాంటి క్రేజీ లైఫ్ ని ఇచ్చారో మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంతటి స్థాయి అందుకుంది మాత్రం నగ్మా అని చెప్పాలి . హీరోయిన్ నగ్మాతో రాఘవేంద్రరావు చేసిన సినిమాలు సూపర్ సూపర్ హిట్ అయ్యాయి. రాఘవేందర్రావు డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నగ్మా హీరోయిన్గా నటించిన సినిమా ఘరానా మొగుడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది . లెక్కలను పూర్తిగా మార్చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమా టైమ్ లో చిరంజీవిని నగ్మాని రాఘవేంద్రరావు తెగ ఇబ్బంది పెట్టేశారట . అంతేకాదు ఈ సినిమాలో ఎంతో మత్తుగా కైపెక్కించే విధంగా ఉండే పాట “ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ” అనే పాటలో నగ్మాని టార్చర్ చేశారట . ఆ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు ఆ కైపు నీ కళ్ళల్లో కనిపించట్లేదు ..నువ్వు మందు తాగాల్సిందే అంటూ బలవంతం చేశారట. అయితే నగ్మా అందుకు ససేమీరా ఒప్పుకోకపోవడంతో టేకుల మీద టేకులు తీసుకుని ఆయన కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ వచ్చేవరకు నగ్మను టార్చర్ చేశారట. హీరోయిన్స్ తో ఎంత సరదాగా ఉండే రాఘవేంద్రరావు .. ఇంత వైల్డ్ యాంగిల్ కూడా ఉందా అంటూ అప్పట్లో జనాలు ఆశ్చర్యపోయారు . ఫైనల్లి సినిమా హిట్ అయిన తర్వాత నగ్మా కెరియర్ ఎలా మారిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news