Moviesమొగుడితో సంసారం చేసుకునేది ఇంత బ‌రి తెగించి చూపిస్తుందా… నిహారిక ఫుల్...

మొగుడితో సంసారం చేసుకునేది ఇంత బ‌రి తెగించి చూపిస్తుందా… నిహారిక ఫుల్ ఎక్స్‌పోజింగ్‌..!

ఇది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. నిజంగానే మొగుడుతో సంసారం చేసుకునే భార్య లక్షణం ఇలా ఉంటుందా ? ఇంత బరితెగించి చూపిస్తుందా ? తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఓ మంచి కుటుంబం నుంచి వచ్చిన వారసురాలిగా నిహారిక చేస్తుంది కరెక్టేనా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొనిదెల పేరు ఇటీవల తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల కంటే ముందు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. యాంకర్ గా ప్రారంభించింది.

బుల్లితెరపై ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టి పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారింది. తనకంటూ సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రొడక్షన్ హౌస్ కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. అయితే గత 15 రోజులుగా నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉందని.. వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకుంటున్నారంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి.

దీనిపై చైతు, నిహారిక ఎవరు ? స్పందించలేదు. అలాగే రెండు కుటుంబాల నుంచి చిన్న క్లారిటీ కూడా కాలేదు. దీనికి తోడు భార్యాభర్తలు ఇద్దరు ఇన్‌స్టా ఖాతాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకుని విడాకుల వార్తలకు మరింత ఊతం ఇచ్చారు. ముందు చైతన్య.. నిహారికతో ఉన్న పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. ఇక నిహారిక కూడా ఒక్క ఫోటో తప్ప అన్ని పెళ్లి ఫోటోలను డిలీట్ చేసేసింది. దీంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ హాట్‌ టాపిక్ గా మారాయి.

అయితే విడాకులు వార్తలు ఇంత‌లా వస్తున్న‌ నేపథ్యంలో నిహారిక సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కోసం ఆఫీసు ప్రారంభించడం.. ఈ కార్యక్రమంలో చైతు ఎక్కడ కనపడకపోవడం.. ఇక ఇప్పుడు పిచ్చ పిచ్చగా హాట్ హాట్ ఫోటోషూట్లతో ఎక్స్‌పోజింగ్ చేయడంతో ఆమె ఎక్కడా తగ్గట్లేదు అని అర్థమవుతుంది. భర్తతో సంబంధం లేకుండా తనకు నచ్చినట్టుగా తాను ఉండేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. అందుకే నెటిజ‌న్లు నిహారిక‌కు భ‌ర్త‌తో బుద్ధిగా సంసారం చేసుకునే ఆలోచ‌న‌లు లేవ‌ని అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news