Moviesఅన్ని బాగున్న రీతూ వర్మ కి అదే మైనస్..అందుకే హీరోలు టెంప్ట్...

అన్ని బాగున్న రీతూ వర్మ కి అదే మైనస్..అందుకే హీరోలు టెంప్ట్ కాలేకపోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావాలి అంటే గ్లామర్ ఎంత ఇంపార్టెంటో..నటన కూడా అంతే ఇంపార్టెంట్.. నటన ఉండి గ్లామర్ లేకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగలేరు.. అందం లేకుండా నటన ఉంటే ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోలేరు .. ఇలా రెండింటికి సమానమైన న్యాయం చేస్తూ ముందుకు వెళ్తేనే హీరోయిన్గా కాస్తో కూస్తో అవకాశాలు అందుకోగలరు . అయితే ఆ రెండు ఉన్నా సరే అదృష్టం లేకపోతే ఏ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారలేదు ఆ కేటగిరిలోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ రీతు వర్మ .

ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకునేందుకు ట్రై చేస్తున్న రీతు వర్మ .. పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాతో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రీతు వర్మ.. ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోయింది. అమ్మడు నటించిన సినిమాలలో కంటెంట్ ఉంటుంది . కానీ కమర్షియల్గా హిట్ అవ్వలేక పోతుంది .

ఈ క్రమంలోనే అన్నీ ఉన్న రీతు వర్మకు ఎందుకు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వలేకపోతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే రీతు వర్మ చాలా మొండి అమ్మాయి అని ..డైరెక్టర్ లు చెప్పిన కంటెంట్ కి యాక్సెప్ట్ చేయదని.. తాను పెట్టుకున్న లిమిట్స్ ని ఏ మాత్రం క్రాస్ చేయదని ..అదే ఆమెలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ అని జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు రీతు వర్మ తను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తే.. పాన్ ఇండియా లెవెల్లో సినిమా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా మారిపోతుందని కూడా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వేరే జాబ్ అయినా చేసుకుంటానేమో గాని అలాంటి పనులు మాత్రం చేయను అంటూ రీతు వర్మ డైరెక్టర్స్ కి ఓపెన్ గానే చెప్పేస్తుందట . ఈ క్రమంలోనే డైరెక్టర్ ల కోరిక తీర్చలేని రీతు వర్మ కోరికను డైరెక్టర్స్ తీర్చలేక పోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news