Moviesపొలిటీషియన్ ని పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. సినీరాజకీయాలల్లో మరో సంచలనం..!?

పొలిటీషియన్ ని పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. సినీరాజకీయాలల్లో మరో సంచలనం..!?

సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ లు చాలా కామన్. దాదాపు 100 కి 90 శాతం మంది అందరు ప్రేమించే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సినిమా చేసేటప్పుడు ఆ షూట్లో ఒకరినొకరు అర్థం చేసుకుని.. ఆ తర్వాత తమ ప్రేమను ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం . అయితే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రాజకీయ నేతలను రాజకీయ ప్రముఖులను పెళ్లి చేసుకోవడం కొంచెం డిఫరెంట్ .

తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణితి చోప్రా. ఎస్ త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే ఈ ప్రచారంలో నిజం కూడా లేకపోనులేదు. ఆప్ ఎంపీ రాఘవ చద్ధ తో ఆమె రిలేషన్ లో ఉన్నారు అంటూ ఇటీవల చాలా వార్తలు వినిపించాయి. వారిద్దరు కలిసి పార్టీలకు హాజరైన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి .

తాజాగా ఇదే నేపథ్యంలో వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ కొత్తగా ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు రాస్తుంది . కాగా దీనిపై తాజాగా ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు . “నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. వారిద్దరి కలయిక ప్రేమ ఆనందం స్నేహంతో కలకాలం కొనసాగాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ విషయం అఫీషియల్ అయిపోయింది . ఈ క్రమంలోనే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని .. అందుకే మరో ఎంపీ ఇలా కామెంట్ చేశారని అంటుంటే .. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి రూమర్స్ ని సక్సెస్ ఫుల్ గా నిజం చేశారు ఈ జంట అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news