Moviesకధ వినకుండానే దసరా సినిమా ని వదులుకున్న ఆ దురదృష్టవంతుడు..ఎవరో తెలిస్తే...

కధ వినకుండానే దసరా సినిమా ని వదులుకున్న ఆ దురదృష్టవంతుడు..ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా . డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది . మొదటి షో తోనే బిగ్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా అయినప్పటికీ డైరెక్షన్ పరంగా ఎటువంటి రి మార్క్ లేకుండా క్లీన్ అండ్ క్లియర్ గా తాను అనుకున్న కథను జనాలకి అర్థమయ్యే విధంగా తెరకెక్కించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి .

అయితే నిజానికి డైరెక్టర్ ఈ కథను రాసుకున్నప్పుడు మొదట అనుకున్నా హీరో రామ్ చరణ్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్ ఈ కథను రాసుకున్నప్పుడు బడా హీరోతో అయితే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని.. సినిమాకి న్యాయం జరుగుతుందని అనుకున్నారట . కానీ అంత పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడు అని తెలుసుకొని ఆయన తన ఆశలను వదులుకున్నారట. ఆ తర్వాత ఈ కథను తీసుకెళ్లి యంగ్ హీరో గా ఉన్న నితిన్ కు చెప్పారట . బడ్జెట్లో వచ్చే హీరోస్ ని చూస్ చేసుకోవాలనే కారణంతో శ్రీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .

అయితే ఈ స్టోరీని నితిన్ కి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ వినకుండానే సినిమా రిజెక్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. కొత్త డైరెక్టర్ కావడంతో కెరీర్ ని రిస్క్ లో పెట్టదం ఇష్టం లేక..ఇలా చేసారత. అంతేకాదు ఆ తర్వాత ఇద్దరు .. ముగ్గురు హీరోలను ట్రై చేశారని .. ఫైనల్గా నానికి ఈ కథ సూట్ అవుతుందని నాని వివరించగా.. ఆయన సెకండ్ కూడా ఆలోచించకుండానే సినిమాకి అగ్రిమెంట్లపై సైన్ చేశాడని ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

ఇలా కోరి వచ్చిన అదృష్టాన్ని చేతులారా మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు నితిన్ అంటూ జనాలు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే నితిన్ టైం బాగోలేదని మరోసారి ప్రూవ్ అయిపోయింది .ఈ కథ నానికే బాగుందని.. నితిన్ లాంటి క్లాస్ హీరోకి ఈ సినిమా బాగోదు అని చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news