Moviesప్ర‌భాస్ - మ‌హేష్ - ప‌వ‌న్ ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌ట్లే… ఈ...

ప్ర‌భాస్ – మ‌హేష్ – ప‌వ‌న్ ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌ట్లే… ఈ వార్ మామూలుగా ఉండేలా లేదే..!

టాలీవుడ్ లో ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం మామూలుగా ఉండదు. ఆ ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమా హిట్ అవుతుందని,, తమ హీరో సినిమా రికార్డులు బీట్ చేస్తుందని, చేసే హంగామాకు అంతే ఉండదు. ఇక సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం అయితే ఒక రేంజ్ లో నడుస్తూ ఉంటుంది. అలాంటిది సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే.. అటు థియేటర్ల దగ్గర.. ఇటు సోషల్ మీడియాలోనూ హీరోల అభిమానులు ఒక రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటారు

సంక్రాంతికి గత కొన్ని దశాబ్దాల నుంచి బాలయ్య, చిరు సినిమాలు ఒకేసారి పోటీ పడితే ఇద్దరు హీరోల అభిమానులు నిజంగానే యుద్ధం చేసుకున్నట్టుగా ఉండేది. ఇక సరిలేరు నీకెవ్వరు, అల‌వైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా మహేష్, బన్నీ అభిమానుల మధ్య ఇదే తరహాలో యుద్ధం జరిగింది. టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి క‌ని విని ఎరుగని రీతిలో బాక్సాఫీస్ యుద్ధం చూడబోతున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పెద్ద హీరోలు నటిస్తున్న భారీ సినిమాలు థియేటర్లలో దిగుతున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మహానటి లాంటి గొప్ప సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ రు. 600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ప్రాజెక్టు కే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం క్రియేట్ చేయబోతున్న నమ్మకాలు అయితే ఉన్నాయి.

ఇక మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. పూజా హెగ్డే, శ్రీ లీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ కే – మహేష్, త్రివిక్రమ్ సినిమాకు తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతి రేసులో నిలుస్తోంది.

హరీష్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను జనవరి 14న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర రచ్చ అయితే మామూలుగా ఉండదు. మనం మంచి మజా లాంటి యుద్ధాన్ని చూడవచ్చు. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోల త్రిముఖ‌ పోరు లో ఎవరు పై చేయి ?సాధిస్తారు. ఎలాంటి పరిణామాలు ? చూడబోతున్నాం అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news